Samantha Ruth Prabhu: సమంత మళ్లీ నటించేందుకు రెడీ అవుతోందా..?
అమెరికా వెళ్లి నెల తిరగకుండానే ఇండియా వచ్చేసింది. ట్రీట్‌మెంట్ ఎలా సాగిందోగానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలు వీడియోలు పెడుతూ టచ్‌లో వుంటూనే వుంది సామ్. ఓ బేబి మూవీ తర్వాత సక్సెస్ చూడలేదు సమంత.
Samantha Ruth Prabhu: సమంత మళ్లీ యాక్టింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వార్త్ ఫ్యాన్స్‌కు ఆనందమే అయినా.. ఈ అమ్మడి ముందు చాలా క్వశ్చన్స్ వున్నాయి. మయోసైటిస్‌నుంచి పూర్తిగా కోలుకుందా..? మళ్లీ అదే గ్లోతో.. గ్లామర్‌తో కనిపించగలదా..? అయినా ఛాన్స్ ఇచ్చేది ఎవరు..? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు సమంత తిరిగి వస్తేనే దొరుకుతాయి. ఖుషీ రిలీజ్ తర్వాత మరో సినిమా ఒప్పుకోకుండా మయోసైటిస్ ట్రీట్‌మెంట్‌కోసం అమెరికా వెళ్లింది.
అయితే, అక్కడే చాలాకాలం వుండి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తుందన్నారు. కానీ, అమెరికా వెళ్లి నెల తిరగకుండానే ఇండియా వచ్చేసింది. ట్రీట్‌మెంట్ ఎలా సాగిందోగానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలు వీడియోలు పెడుతూ టచ్‌లో వుంటూనే వుంది సామ్. ఓ బేబి మూవీ తర్వాత సక్సెస్ చూడలేదు సమంత. యశోదకు యావరేజ్ మార్కులే పడ్డాయి. ఇక శాకుంతలం అయితే.. ఎన్నో విమర్శలు తీసుకొచ్చింది. అదిరిపోయే హిట్‌తో కమ్ బ్యాక్ కావాలని ఐదేళ్ల నుంచి వెయిట్ చేస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషీ నష్టాలు మిగిల్చింది. స్టార్స్ ఈ అమ్మడిని పట్టించుకోవడం మానేశారు. రంగస్థలం తర్వాత స్టార్ హీరోతో జత కట్టలేదు. మధ్యలో పుష్పతో ఐటంసాంగ్ మాత్రం చేసింది. ఈ సాంగ్ అన్ని లాంగ్వేజెస్‌లో సమంతకు క్రేజ్ తీసుకొచ్చింది.
కొత్త సంవత్సరంలో మళ్లీ యాక్టింగ్ స్టార్ట్ చేయాలనుకుంటోంది సమంత. వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందిపడుతున్న సమంతకు ఛాన్స్ ఇచ్చేది ఎవరు..? మయోసైటిస్‌తో ఫేస్‌లో గ్లో తగ్గడం మైనస్ అయింది. శాకుంతలం ఫ్లాప్ కావడంతో ఆమెతో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తీసే ధైర్యం చేస్తారా..? అన్న డౌట్ వుంది. అయితే.. తన తొలి వెబ్ సిరీస్ ఫ్యామిలీ మేన్ క్రేజ్ తీసుకురావడంతో మళ్లీ ఆ దారిలోనే వెళ్తే మాత్రం.. ఆఫర్స్ గ్యారెంటీ.