Samantha: స్ట్రాటజీ మార్చిన సామ్.. కన్ఫ్యూజన్‌లో టాలీవుడ్

సైబీరియాలో తాను నటిస్తున్న వెబ్ సిరీస్ యాక్షన్ సన్నివేశాల షూటింగ్ కోసం అక్కడ బిజీగా ఉంటున్న సమంతకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయంపై ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 14, 2023 | 11:22 AMLast Updated on: Jun 14, 2023 | 11:22 AM

Samantha Ruth Prabhu Not Interested In Tollywood Is She Rejecting Movies Here

Samantha: సమంత పేరు ప్రస్తావనకు వచ్చిన ప్రతీసారి పది నిమిషాలు కచ్చితంగా చర్చ జరుగుతుంది. ఆమె జీవితంలో, ఆమె వల్ల సినిమా ప్రపంచంలో జరిగిన విషయాలతో మొదలయ్యే చర్చ అది. నాగచైతన్యతో విడిపోవడం.. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు.. ఇలా అన్నిటితోను యుద్ధంచేసిన సమంత ఆ పరిస్థితుల ప్రభావం నుంచి తేరుకుని ప్రస్తుతం తన సినిమా కెరియర్ పై దృష్టి పెట్టింది.

సైబీరియాలో తాను నటిస్తున్న వెబ్ సిరీస్ యాక్షన్ సన్నివేశాల షూటింగ్ కోసం అక్కడ బిజీగా ఉంటున్న సమంతకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయంపై ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది మీడియం రేంజ్ హీరోలు తమ సినిమాలకు సంబంధించి సమంతతో కలిసి నటించాలని అభిప్రాయంతో తమ మూవీ దర్శకులతో రాయబారాలు చేస్తున్నప్పటికీ ఆ సినిమాలకు సంబంధించిన కథలు వినే విషయంలో పెద్దగా సమంత ఇంట్రస్ట్ చూపించడం లేదంటూ గాసిప్స్ వస్తున్నాయి. అంతేకాదు ఆమె ఆ సినిమాలలో హీరోయిన్‌గా నటించే విషయంలో దర్శక నిర్మాతలకు చెపుతున్న పారితోషికం రేంజ్ విని ఆ నిర్మాతల మైండ్ బ్లాంక్ అవుతున్నట్లు టాక్.

సమంత తాను నటించే సినిమాలలో తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండాలని.. అదేవిధంగా వీలైనంత వరకు హీరోయిన్ ఒరియేంటెడ్ కథలు ఉంటే తన దగ్గరకు తీసుకురమ్మని ఆయా దర్శక నిర్మాతలకు చెపుతోంది అని అంటున్నారు. దీనితో సమంత కావాలని ఇలా చేస్తోందా.. లేదంటే ఆమె వ్యూహాలలో ఏమైనా మార్పులు వచ్చాయా అన్న చర్చలు కూడ ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి. గతంలో తాప్సీ, ఇలియానా టాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని వదులుకుని బాలీవుడ్ వైపు పరుగులు తీసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దూరం అయ్యారు. మరి సమంత కూడా ఇప్పుడు అలాంటి తప్పే చేస్తుందా అనే చర్చ జరుగుతోంది.