Top story: సమంత కి అనంత కష్టాలు ?

టాలెంట్ ఉంది. గ్లామర్ ఉంది. కష్టపడే తత్వం. అందరితో కలుపుగోలుగా ఉండే మనస్తత్వం. హార్డ్ వర్కర్. అందుకే ఇండస్ట్రీలో త్వరగా ఎదిగింది. కానీ ఎక్కడో విధి దెబ్బ కొడుతోంది. జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి వరస కష్టాలు, ఎదురు దెబ్బలు వెంటాడుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 7, 2024 | 02:45 PMLast Updated on: Dec 07, 2024 | 2:45 PM

Samantha Ruth Prabhu Now Faces Endless Hardships

టాలెంట్ ఉంది. గ్లామర్ ఉంది. కష్టపడే తత్వం. అందరితో కలుపుగోలుగా ఉండే మనస్తత్వం. హార్డ్ వర్కర్. అందుకే ఇండస్ట్రీలో త్వరగా ఎదిగింది. కానీ ఎక్కడో విధి దెబ్బ కొడుతోంది. జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి వరస కష్టాలు, ఎదురు దెబ్బలు వెంటాడుతున్నాయి. కొన్ని స్వయంకృతాపరాధాలు, ఇంకొన్ని విధి వెక్కిరింతలు మొత్తంగా సమంత రూత్ ప్రభు ఇప్పుడు అనంత కష్టాలను ఎదుర్కొంటుంది.

పడి లేవడం.. లేచి పడడం.. వ్యక్తిగతంగా, కెరీర్‌పరంగా సమంతకు కొత్తేం కాదు! హోటల్‌ రిసెప్షన్స్ట్ గా పనిచేసినప్పటి నుంచి.. టాప్ హీరోయిన్‌గా ఎదిగే వరకు కష్టాలు, కన్నీళ్లు.. ఆనందాలు, ఆనందభాష్పాలు.. చాలా చూసింది సమంత ! జీవితంలో ప్రతీదశలో ఏదో ఒక కష్టాన్ని మోసిన సమంతను.. ఇప్పుడు ఒకేసారి అన్ని కష్టాలు చుట్టుముట్టాయ్‌. జీవితాంతం తోడుగా ఉంటానన్న వాడు లేడు , జీవితం ఇచ్చిన నాన్న లేడు.. కెరీర్‌ లేదు. వీటన్నింటి తో పాటు చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు సమంతను మరింత వేధిస్తున్నాయి. సమంతది కష్టం రాసిన కథ.. కన్నీళ్లు కలిసిన కథేమో అనిపిస్తుంది. నిన్నకాక మొన్న సన్నిహితు లు, ఇండస్ట్రీలో స్టార్లు మధ్య… అన్నపూర్ణ స్టూడియోస్‌లో శోభితతో నాగచైతన్య పెళ్లి ధూమ్‌ధామ్‌గా జరిగింది. చైతూ రెండో పెళ్లి వేళ.. సమంత కష్టాలపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఇప్పుడు ఆమె ఎలా ఉందో ? వీళ్ళిద్దరి పెళ్లి చూసి ఎలా ఫీలవుతుందో అని చుట్టూ ఉన్నవాళ్లు చర్చించుకుంటున్నారు .ఎన్నో ఆశలతో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది సామ్‌. ఐతే కొన్నేళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగినా.. అనుకొని విధంగా వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల సమయంలో ఎంతో ఒత్తిడికి గురైన సమంత.. ఆ తర్వాత మయోసైటిస్ బారిన పడింది. దీంతో కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరమై ట్రీట్‌మెంట్ చేయించుకుంది.

దాని నుంచి బైటపడి.. ఈ మధ్యే సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ఫ్యాన్స్‌ ముందుకు వచ్చింది. సిటాడెల్ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక డివోర్స్ బాధ నుంచి బయపడినట్లే.. ఇక అంతా సెట్‌.. మళ్లీ కెరీర్‌ కాన్సన్‌ట్రేట్ చేయవచ్చు అనుకుంటున్న సమయంలో.. సమంత జీవితంలో మళ్లీ కుదుపు. సామ్ తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. తండ్రితో సమంతకు మంచి అనుబంధం ఉంది. పర్సనల్‌గా, కెరీర్‌పరంగా.. సమంత అనే పేరు వెనక ఆయన కష్టం ఎంతో ఉందని.. సామ్ చాలాసార్లు చెప్పుకొచ్చింది. అలాంటిది ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్న సమయంలో.. తండ్రిని కోల్పోవడం అంటే.. సామ్ కష్టాన్ని తలుచుకోవడానికి కూడా ఇబ్బందే ! ఓ వైపు మయోసైటిస్‌.. మరోవైపు జీవితంలో డిప్రెషన్‌.. ఇలాంటి టైమ్‌లో.. తండ్రి తోడుగా ఉంటారనుకుంటే.. ఆయన వెళ్లిపోయాడు. విడిపోవడం సమస్య కాదు.. విడిపోయిన తర్వాత ఎదురయ్యే పరిస్థితులే.. ఎదురీదేలా చేస్తాయ్. సమంత విషయంలో అదే జరిగింది. చైతన్యతో డివోర్స్ తర్వాత.. తనను సెకండ్ హ్యాండ్.. యూజ్డ్‌ అన్నారని సమంత ఎంతో బాధపడింది. ఐనా సరే ఏదోలా సర్దిచెప్పుకొన్ని మళ్లీ జనం ముందుకు వచ్చిన సమంతను.. ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయ్. తండ్రి చనిపోయి సమంత బాధలో ఉంటే.. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా సానుభూతి తెలపలేదు.

ఎంత బిజీగా ఉన్నా.. డైరెక్ట్‌గా మాట్లాడకపోయినా.. సోషల్ మీడియాలో అయిన కనీసం సానుభూతి, సంతాపం చెప్పొచ్చు కదా అనేది సమంత ఫ్యాన్స్‌ వాదన. నాగచైతన్యతో డివోర్స్, ఆ తర్వాత మయాసైటిస్, మరో వైపు కెరిర్లో స్ట్రగుల్… వీటన్నిటికి మించి ఇటీవల సమంతకు ఎటువంటి సంబంధం లేకుండానే…. ఒక చిల్లర వ్యవహారంలో చిక్కుకుంది. మంత్రి కొండా సురేఖ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని విమర్శిస్తూ, సమంతని పంపించాలని కేటీఆర్ నాగార్జున ని కోరాడని, సమంత నిరాకరించిందని ఒక అసహ్యకరమైన స్టేట్మెంట్ ఇచ్చింది. దీనిపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. అక్కినేని కుటుంబాన్ని, హైదరాబాద్ ని సమంత వదిలేసి వెళ్లిపోయిన ఇక్కడ వివాదాల్లో తరచూ ఆమె పేరుని ప్రస్తావిస్తూనే ఉన్నారు కొందరు. అదే విషయాన్ని సమంత మధ్య ఎక్స్ లో ట్విట్ చేసింది కూడా. అంతేకాదు నాగచైతన్య తో పెళ్లికి ముందు సమంత హీరో సిద్ధార్థ తో ప్రేమ వివాహాలు నడిపింది. కాళహస్తిలో ఇద్దరు కలిసి భార్యాభర్తల్లాగే
రాహు కేతు పూజలు కూడా చేశారు. కానీ కొన్నాళ్ల తర్వాత వాళ్ల ప్రేమ బ్రేకప్ అయింది. అప్పుడప్పుడు సమంతని టార్గెట్ చేస్తూ సిద్ధార్థ పరోక్షంగా విమర్శిస్తూ ట్వీట్లు కూడా చేస్తుంటాడు. సిద్ధార్థ లాంటి వాడి విషయంలో సమంత చేసిన స్వయంకృత అపరాధం ఇలా వెంటపడుతూ ఉంటుంది. అలాగే కొన్నాళ్లపాటు మాటల మరాఠీ అయిన ఓ దర్శకుడి మాయలో పడిపోవడం కూడా సమంతకు పెళ్లయిన తర్వాత చాలా సమస్యలు తెచ్చింది. సమంతతో విడాకులకు ముందే శోభిత ధూళిపాళ్లతో వ్యవహారం నడిపిన నాగ చైతన్య…. సమంతని తక్కువ చేయడానికి పెళ్లికి ముందు ఆమె అఫైర్స్ ని ఆయుధంగా వాడాడు. మొత్తం మీద కెరీర్, పెళ్లి అనే ఎపిసోడ్స్ లో ఒంటరిగా మిగిలిపోయిన సమంత. నాగచైతన్య సోవిత పెళ్లిరోజు… ఆమె చేసిన ఆసక్తికరమైన వీడియో ట్వీట్… మనోధైర్యం కోసం ఆమె ఎంత కష్టపడుతుందో చెప్తుంది. ఫైట్ లైక్ ఎ గర్ల్ అనే ట్యాగ్ లైన్ తో సమంత పెట్టిన వీడియో…. ఆమె అనంత కష్టాల మధ్య తనతో తానే యుద్ధం చేస్తుందనే విషయాన్ని చెప్తోంది.