Samantha Ruth Prabhu: విడిపోయాక ప్రశాంతంగా ఉంది.. సామ్ షాకింగ్ కామెంట్స్
చాలా కాలం తరువాత.. ఎవరూ ఊహించని రేంజ్‌లో తన విడాకుల గురించి రియాక్ట్ అయ్యింది సామ్. కొన్ని రోజుల నుంచి యూట్యూబ్‌లో పాడ్‌కాస్ట్‌లు చేస్తున్న సమంత.. తన అనుభవాలు, భావాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.
Samantha Ruth Prabhu: చాలా కాలం తరువాత తన పెళ్లి, విడాకుల గురించి రెస్పాండ్ అయ్యింది హీరోయిన్ సమంత. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత పెద్దగా ఎప్పుడు, ఎక్కడా ఆ టాపిక్ గురించి సామ్ మాట్లాడలేదు. చైతన్య కూడా ఈ టాపిక్ గురించి మాట్లాడేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ చాలా కాలం తరువాత.. ఎవరూ ఊహించని రేంజ్‌లో తన విడాకుల గురించి రియాక్ట్ అయ్యింది సామ్. కొన్ని రోజుల నుంచి యూట్యూబ్‌లో పాడ్‌కాస్ట్‌లు చేస్తున్న సమంత.. తన అనుభవాలు, భావాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.
KCR-BJP: ఒప్పుకోండి ప్లీజ్ ! కేసీఆర్‌కి జైలు తప్పదా.. ఢిల్లీలో పైరవీలు అందుకేనా..?
ఇందులో భాగంగానే రీసెంట్‌గా తన విడాకుల గురించి కామెంట్ చేసింది. తాను మయోసైటిస్‌కు గురి కాకముందు దాదాపు సంవత్సర కాలం విడాకుల విషయంలో నలిగిపోయిందట సమంత. విడాకులు తీసుకోవాలా.. వద్దా.. అనే నిర్ణయం తనను వేధించేదట. కానీ చివరకు ఎట్టకేలకు విడాకులు తీసుకుందట. అఫిషియల్‌గా ఈ నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత చాలా రిలాక్సింగ్‌గా ఫీల్ అయ్యానని చెప్పింది సమంత. ఇదే విషయాన్ని తాను ఫ్లైట్‌లో వస్తున్నప్పుడు తన అసిస్టెంట్‌కి కూడా చెప్పిందట. ఏదో బరువు దిగిపోయినట్టు, చాలా కూల్‌గా అనిపిస్తోంది అంటూ చెప్పిందట. ఇది జరిగిన కొన్ని రోజులకే హెల్త్ చెకప్‌లో తనకు మయోసైటిస్ ఉందని తేలిందట. దీంతో మళ్లీ తాను డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు చెప్పుకొచ్చింది.
ఇలా తన జీవితంలో వెంటవెంటనే జరిగిన ఈ రెండు అతిపెద్ద పరిణామాలను తాను మర్చిపోలేనంటూ ఫ్యాన్స్‌తో పంచుకుంది. మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా ఉండే పెయిర్ సమంత, నాగచైతన్య. వీళ్లిద్దరి సినిమాల కంటే వీళ్ల వ్యక్తిగత జీవితాల గురించి చేసే కామెంట్సే ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా అంతే. సమంత చేసిన ఈ కామెంట్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. సామ్ ఫ్యాన్స్ అంతా ఆమెకు ధైర్యం చెప్తున్నారు.