Samantha Ruth Prabhu: మా ఇంటి బంగారం సమంత.. కొత్త సినిమా ఫస్ట్ లుక్ రివీల్

నేటితో సమంత 37వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు సమంతకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. సమంత నటించబోతున్న కొత్త సినిమా టైటిల్, ప్రీ లుక్ రివీల్ అయింది. ఈ సినిమా పేరు మా ఇంటి బంగారం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 28, 2024 | 06:09 PMLast Updated on: Apr 28, 2024 | 6:09 PM

Samantha Ruth Prabhu Shares First Look From Upcoming Film Maa Inti Bangaram On Her Birthday

Samantha Ruth Prabhu: టాలీవుడ్, కోలీవుడ్‌‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ స్టార్ హీరోయిన్ సమంత. అందంతోనే కాకుండా.. నటిగా కూడా పేరు తెచ్చుకుంది. యూత్ సమంత అందానికి ఫిదా అయ్యారు. అమ్మాయిలకు కూడా సమంత అంటే క్రేజ్. ఆమె యాక్టింగ్‌ విషయంలో వంక పెట్టడానికి లేదు. ఏ పాత్రనైనా అద్భుతంగా చేయగలదు. సమంత గురించి అందరికీ తెలిసిన ఈ పరిచయం ఇవ్వాళే ఎందుకంటే.. నేడు సమంత పుట్టిన రోజు.

BJP-RESERVATION: బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందా..? తేల్చేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్..

నేటితో సమంత 37వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు సమంతకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. సమంత నటించబోతున్న కొత్త సినిమా టైటిల్, ప్రీ లుక్ రివీల్ అయింది. ఈ సినిమా పేరు మా ఇంటి బంగారం. ఇది నిజంగా సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే కొంతకాలంగా సమంత సినిమాలు చేయట్లేదు. హిందీలో ఒక వెబ్ సిరీస్ మాత్రమే చేస్తోంది. అంతకుముందు సమంత చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. పైగా తన మయోసైటిస్ సమస్య వల్ల ఏడాదికిపైగా సినిమాలకు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో మళ్లీ సమంత ఎప్పుడు సరైన సినిమాతో వస్తుందా అని ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టైంలో సమంత మా ఇంటి బంగారం అనే కొత్త సినిమాలో నటించబోతున్నట్లు వెల్లడైంది. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్, ప్రీలుక్ కూడా విడుదలైంది. ఈ సినిమా తప్పకుండా సమంత కమ్‌బ్యాక్ మూవీ అవుతుందని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఈ మూవీని తన సొంత ప్రొడక్షన్ హౌస్ త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంతనే నిర్మిస్తోంది. ఈ సినిమా దర్శకుడు, ఇతర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ, ఈ లుక్‌లో సమంత ఆకట్టుకునేలా ఉంది. వంట గదిలో, చేతిలో తుపాకీ ఎక్కుపెట్టి కనిపిస్తోంది. మెడలో తాళి ఉంది. కాబట్టి.. ఈ సినిమాలో సమంత పెళ్లైన మహిళగా కనిపించబోతుందని తెలుస్తోంది. ఏదేమైనా.. ఈ సినిమా సమంతకు మంచి కమ్‌బ్యాక్ మూవీ కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హ్యాపీ బర్త్‌ డే సమంతా..!

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)