Allu Arjun: సమంత మళ్లీ ఊ.. అంటోందని తేల్చేసిన సుకుమార్..!

పుష్ప 2లో అతి ముఖ్యం అనుకున్న ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ పైట్ సీన్స్ షూటింగ్‌ని పూర్తి చేసింది సినిమా టీం. కొంత ప్యాచ్ వర్క్ వదిలేస్తే, మిగతా టాకీ పార్ట్ మాత్రమే తెరకెక్కించాలి. ఇక పాటల్లో మూవీకి ప్రాణమైన ఐటమ్ సాంగ్ పెండింగ్ ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 29, 2024 | 07:55 PMLast Updated on: Feb 29, 2024 | 7:55 PM

Samantha Ruth Prabhu Will Doing Song In Pushpa 2 With Allu Arjun

Allu Arjun: పుష్ప రాజ్ షూటింగ్ జెట్‌ స్పీడ్‌తో సాగుతోంది. సెట్లో ఫైట్లు, పాటలు ఇలా ఏదో ఒక పనితో తెగ బిజీ అయ్యాడు బన్నీ. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 15కి సినిమాని రిలీజ్ చేసేందుకు సుకుమార్ కంకణం కట్టుకున్నాడు. అందుకే పక్కా ప్లానింగ్‌తో, గ్యాప్ లేకుండా పుష్ప 2 పనుల్లోనే బిజీ అయ్యాడు. అందులో భాగంగానే ఫిబ్రవరిలో ఫ్యాన్స్ కోసం ఓ షూటింగ్ వీడియోతో అప్‌డేట్ ఇవ్వాలనుకున్నా ఇవ్వలేదు.

Drishyam: హాలీవుడ్‌లో రీమేక్ కాబోతున్న దృశ్యం.. సంచలనం ఖాయమా..?

దానికి సడన్‌గా సినిమా తాలూకు లెక్కలుమారటమే కారణం. పుష్ప 2లో అతి ముఖ్యం అనుకున్న ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ పైట్ సీన్స్ షూటింగ్‌ని పూర్తి చేసింది సినిమా టీం. కొంత ప్యాచ్ వర్క్ వదిలేస్తే, మిగతా టాకీ పార్ట్ మాత్రమే తెరకెక్కించాలి. ఇక పాటల్లో మూవీకి ప్రాణమైన ఐటమ్ సాంగ్ పెండింగ్ ఉంది. సాంగ్ రికార్డింగ్ అయిపోయాకే, ఈ పాటని పిక్చరైజేషన్ చేసే విధానం మీదే చర్చలు జరిగాయి. ముందుగా ఇందులో ఐటమ్ లేడీగా కృతి సనన్ అన్నారు. మరోసారి.. ఊర్వశీ రౌతేలా చిందేస్తుందన్నారు. ఫైనల్‌గా జాన్వీ కపూర్‌తో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారన్నారు. కాని అవేవీ ఫైనల్ కాలేదు. ఐతే జాన్వీ కపూర్ ఎంట్రీ మాత్రం కన్ఫామ్ అయ్యింది.

పుష్ప 2లో జాన్వీకి గెస్ట్ రోల్ ఇచ్చి, ఐటమ్ సాంగ్ కోసం కూడా వాడబోతున్నారట. అంతేకాదు సమంత కూడా ఐటమ్ సాంగ్ చివర్లో మెరుస్తుంది. అలా ఫస్ట్ పార్ట్ తాలూకు కిక్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. మొత్తంగా ఐటమ్ సాంగ్‌లో ఇద్దరు అందగత్తెలు, సినిమా మొత్తం శ్రీవల్లిగా రష్మిక కనిపించబోతున్నారు. ఇలా పుష్ప 2 కోసం గ్లామర్ డోస్ భారీగానే పెంచాడు సుకుమార్.