Samantha: మరోసారి వాయిదాపడ్డ శాకుంతలం మూవీ..!
సమంతా.. ఏమాయ చేశావే అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి తనదైన నటనతో ప్రజల మనసును మాయచేసింది ఈ భామ. కొద్దిరోజుల క్రితం తీవ్రమైన మయోసైట్స్ వ్యాధిభారిన పడి ప్రస్తుతం క్రమక్రమంగా కోలుకొని శాకుంతలంతో సినీ అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో కొంత భావోద్వేగానికి గురైన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన కారణాలను వివరించలేదు. త్వరలోనే మరో విడుదల తేదీని ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
రఘువంశం, కుమారసంభవం వంటి అద్భుతమైన కావ్యాలను రచించారు కాళిదాసు. ఈయన రచించిన నవలలో నుంచి అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కించిన శాకుంతలం సినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించగా, సమంతా శకుంతలా దేవి పాత్ర పోషించారు. వీరి కుమారుడుగా స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్ కూతురు అర్హా కీలకపాత్ర పోషించింది. ఇప్పటికే ట్రైలర్, పాటలు, పిక్చరైజేషన్ అందరికీ ఆకట్టుకున్నాయి. గుణశేఖర్ తన మార్క్ ను చూపించారు అని వీటిని చూసిన వారు అభిప్రాయపడ్డారు. ఎప్పుడెప్పుడు సమంతాను బిగ్ స్క్రీన్ పై చూస్తామా అని కళ్లలో వత్తులేసుకొని ఎదురుచూసే వారికి షాకింగ్ విషయాన్ని తెలిపారు శాకుంతలం టీం.
The theatrical release of #Shaakuntalam stands postponed.
The new release date will be announced soon 🤍@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna #ManiSharma @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/63GIFbK4CF
— Sri Venkateswara Creations (@SVC_official) February 7, 2023
ఈ చిత్రం విడుతల తేదీ వాయిదా పడటానికి కారణాలు తెలుగులో సితారా ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న సార్ అనే చిత్రం. దీంతో పాటూ గీతా ఆర్ట్స్ 2 నిర్మాణంలో.. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కించిన చిత్రం వినరోభాగ్యము విష్ణు కథ. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. దీని కారణాంగా వాయిదా పడి ఉండవచ్చు అనే ఊహాగానాలు అభిమానుల్లో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే శాకుంతలం సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. సాధారణంగా ఇది నవంబర్ 4, 2022న ప్రేక్షకుల ముందుకు రావల్సిఉంది. అప్పట్లో 3డి గ్రాఫిక్స్ పనులు పెండింగ్లో ఉన్న కారణంగా వాయిదా వేశారు. ఇన్ని నెలలుగా వేచి చూసిన అభిమానులు మరో విడుదల తేదీ వరకూ వేచి చూడక తప్పదు.