నువ్వు లేకపోయినా నాకు నష్టం లేదు సామ్ సంచలన పోస్ట్
హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచీ సమంత ఏం చేసినా వైరల్‌గానే మారుతోంది. నిజానికి తన గత అనుభవాలను గుర్తుకుతెచ్చేలా సామ్ ఏదో ఒక పోస్ట్ అప్పుడప్పుడూ వదులుతూనే ఉంది.

హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచీ సమంత ఏం చేసినా వైరల్‌గానే మారుతోంది. నిజానికి తన గత అనుభవాలను గుర్తుకుతెచ్చేలా సామ్ ఏదో ఒక పోస్ట్ అప్పుడప్పుడూ వదులుతూనే ఉంది. అలాగే రీసెంట్‌గా సామ్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. విడాకుల తరువాత సినిమాలతో పాటు సమానంగా తన మెంటల్, ఫిజికల్ హెల్త్ కాపాడుకునే యాక్టివిటీస్ చేస్తోంది సమంత. తనను బాధపెడుతున్న మయోసైటిస్‌ను కూడా ఎదుర్కునేందుకు ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే ఉంది. దాంతో పాటు సమయం దొరికిన ప్రతీ సారి మానసిక వికాసం కోసం టూర్లు, ధ్యానాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇండియాలో ఫేమస్ అయినా ఇషా ఫౌండేషన్‌కు వెళ్లింది సమంత. మూడు రోజుల పాటు ఫోన్ వాడకుండా ధ్యానంలోనే గడిపింది. మూడు రోజుల తరువాత ఫోన్‌కు దూరంగా ఉన్న తన అనుభవాన్ని పంచుకుంటూ ఓ పోస్ట్ చేసింది.
ఫోన్ లేకుండా ఇప్పుడు బతకండం అంటే దాదాపు ఒంటరిగా ఏకాంతంగా బతికినట్టే. ఆ అనుభవం చాలా భయంకరంగా ఉంటుంది. కానీ నా జీవితంలో ఇలాంటి రోజులు నేను ఎన్నో గడిపాను. ఏకాంతంగా గడిపిన ఆ క్షణాలు చాలా భయంకరం. కానీ ఇలాంటివి ఎదుర్కునేందుకు నాకు ధైర్యం ఉంది. ఇలాంటి రోజులు లక్ష సార్లు గడపడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ పోస్ట్ చేసింది సమంత. సామ్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. చైతన్యతో విడాకుల తరువాత నిజానికి చైతన్య మూవ్ ఆన్ అయ్యాడు. రీసెంట్‌గానే తన గర్ల్‌ఫ్రెండ్ శోభితను పెళ్లి కూడా చేసుకున్నాడు.
కానీ సామ్ మాత్రం చాలా కాలం అదే పెయిన్‌లో ఉంది. అదే సమయంలో మయోసైటిస్ కూడా బాధించడంతో చాలా కాలం అసలు మీడియా ముందుకు కూడా రాలేదు. సినిమా ప్రమోషన్స్‌లో కూడా పెద్దగా పాల్గొనలేదు. చైతన్యతో విడిపోయిన ఆ రోజులను తల్చుకునే సామ్ ఈ పోస్ట్ పెట్టిందని తన ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. ఇలాంటి రోజులు ఎన్నైనా గడిపేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సామ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను మెచ్చుకుంటున్నారు. జీవితంలో ఎన్ని జరిగినా ధైర్యం కోల్పోకుండా పోరాడాలంటూ తమ ఫేవరెట్ హీరోయిన్‌కు ధైర్యం చెప్తున్నారు.