Samantha: మీది మీరు తీసుకోండి.. ఇక సెలవు.. మాయలేడి ట్విస్ట్..
మాయలేడి సమంత అనారోగ్యం నుంచి కోలుకుని ఖుషీ షూటింగ్ తో బిజీ అయ్యిందన్నారు. హిందీ సిటీడెల్ షూటింగ్ తో కూడా ఫుల్ బిజీ అన్నారు. కట్ చేస్తే ఇక సెలవు అంటోంది. ఇక సినిమాలకు రాం రాం చెప్పేసింది.. ఇంతకి ఏమైంది? హావేలుక్.

Samantha suffers from myositis. He put a break on all his current shootings
సమంత మయో సైటిస్ తో బాధపడుతున్నప్పుడు చనిపోతుందనేంతగా ఫ్యాన్స్ కంగరు పడ్డారు. కాని తను ఫైట్ చేసింది. కోలుకుంది. ఆగిపోయిన ఖుషీ మూవీలో తన సీన్స్ తాలూకు షూటింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు సిటీడెల్ అంటూ హిందీ వెబ్ సీరీస్ ని పూర్తిచేసే పనిలో ఉంది.
ఇంతలో సడన్ గా తన కమిటైన కొత్త సినిమాల తాలూకు అడ్వాన్స్ లని సమంత తిరిగి నిర్మాతలకు ఇచ్చేస్తోందన్న వార్త షాక్ ఇస్తోంది. ఏకంగా ఎనిమిది సినిమాల తాలూకు అడ్వాన్స్ లను ప్రొడ్యూసర్స్ కి సమంత తిరగి ఇస్తోందట. సిటాడెల్ పూర్తయ్యాక తను సినిమాలు చేయనంటోందట. అందుకే కొత్త సినిమాలు సైన్ చేయట్లేదు. పాత కమిట్మెంట్స్ తాలూకు అడ్వాన్స్ లు ఇవ్వక తప్పట్లేదు.
ఏడాది పాటు తను సినిమాలకు దూరంగా ఉంటానంటోంది కాని, తను ఇక సినిమాలు చేసే ఉద్దేశ్యంలో లేదనే మాటే వినిపిస్తోంది. కారణం మయో సైటిస్ తాలూకు ఇబ్బందులు ఇంకా తనని వేధించటమేనట. కేవలం నిర్మాతలను ఇబ్బంది పెట్టొద్దనే ఖుషీ, సిటాడెల్ పూర్తిచేసేందుకు తనను తాను సిద్దం చేసుకున్న సమంత, మయో సైటిస్ నుంచి పూర్తిగా బయట పడ్డాననుకున్నాకే రీ ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. కాబట్టి ఏడాది సినిమా బ్రేక్ కాస్త ఎన్నేళ్లు కొనసాగుతుందో అన్న అనుమానాలే పెరిగాయా.