Samantha: శాకుంతలం షూటింగ్ సమయంలో జరిగిన ఐదు సంచలన విషయాలు చెప్పిన సమంత

సామ్‌ తొలి పౌరాణిక చిత్రం 'శాకుంతలం' ఆమెకు చాలా అనుభూతులు మిగిల్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న శాకుంతలం 14న రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో సినిమా గురించిన ఐదు ఫ్యాక్ట్స్‌ చెప్పింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 11, 2023 | 12:09 PMLast Updated on: Apr 11, 2023 | 12:09 PM

Samantha Tells Five Sensational Things Happened During The Shooting Of Shakunthalam

Samantha: మయోసైటిస్‌ నుంచి కోలుకున్న సమంత అలుపు సొలుపు లేకుండా.. శాకుంతలం ప్రమోషన్‌లో బిజీ అయిపోయింది. పాన్‌ ఇండియా మూవీ కావడంతో.. దేశం మొత్తం తిరిగేస్తూ… సినిమాకు హైప్‌ తీసుకొస్తోంది సామ్‌. సినిమా షూటింగ్‌ టైంలో ఫేస్‌ చేసిన ఐదు క్రేజీ ఫ్యాక్ట్స్‌ చెప్పింది.

సామ్‌ తొలి పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ ఆమెకు చాలా అనుభూతులు మిగిల్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న శాకుంతలం 14న రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో సినిమా గురించిన ఐదు ఫ్యాక్ట్స్‌ చెప్పింది. తనకు పూలు పడవని.. ఓ సీన్‌లో చేతికి పూలు కట్టుకోవాల్సి వస్తే.. మచ్చలు పడ్డాయని బయట పెట్టింది. ఆ మచ్చల్ని మేకప్‌తో మ్యానేజ్‌ చేసిందట. శాకుంతలం సౌత్‌లోని అన్ని భాషలు.. హిందీతో కలిపితే ఐదు భాషల్లో రిలీజ్‌ అవుతోంది. ఈ ఐదింటిలో మూడు లాంగ్వేజెస్‌లో సమంతే సొంతంగా డబ్బింగ్ చెప్పింది.

తెలుగు, తమిళం, హిందీలో డబ్బింగ్‌ చెప్పడం సామ్‌కు కష్టం అనిపించిందట. కన్నడ, మలయాళంలో వేరే వాళ్లు డబ్బింగ్‌ చెప్పారు. షూటింగ్‌ టైంలో కుందేలు కరిచిందని ఇంకో నిజం బైటపెట్టింది సామ్‌. సినిమాలో తనది ఒరిజినల్‌ జుట్టు కాదని, కానీ.. ఒరిజినల్‌గా వుంటుందంటూ మరో ఫ్యాక్ట్ రివీల్‌ చేసింది. 30 కేజీల లెహంగా వేసుకుని.. రౌండ్‌గా తిరిగే సమయంలో ఫ్రేమ్‌ నుంచి పక్కకు వెళ్లిపోయానంటూ ఐదో ఫ్యాక్ట్స్‌ చెప్పింది. మరి ఈ నిజాలు అన్ని శాకుంతలం మూవీకి హిట్ తెస్తాయో లేదో చూడాలి.