Samantha Ruth Prabhu: త్వరలో బాలీవుడ్‌కి సమంత.. సల్మాన్‌కి జోడీగా సామ్..

యశోదకు యావరేజ్‌ మార్కులే పడ్డాయి. ఇక శాకుంతలం అయితే ఎన్నో విమర్శలు తీసుకొచ్చింది. అందమైన శాకుంతలంను పేలవంగా చూపించారన్నారు. సామ్‌ వాయిస్‌ మైనస్‌ అయింది. అదిరిపోయే హిట్‌తో కమ్‌ బ్యాక్‌ కావాలని ఐదేళ్ల నుంచి వెయిట్‌ చేస్తోంది సామ్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 18, 2023 | 09:00 PMLast Updated on: Sep 18, 2023 | 9:00 PM

Samantha To Make Bollywood Debut With Salman Khan In Karan Johars Next

Samantha Ruth Prabhu: ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషి సమంతని నిరాశపరిచింది. ఫామ్‌లోకి వద్దామనుకుంటే.. ఊహించని రిజల్ట్‌తో సామ్‌ డీలా పడిపోయింది. చేతిలో ఒక్క సినిమా లేదు. మరోవైపు మయోసైటిస్‌ ట్రీట్‌మెంట్‌. సామ్‌.. ఓ బేబి మూవీ తర్వాత సక్సెస్‌ చూడలేదు. యశోదకు యావరేజ్‌ మార్కులే పడ్డాయి. ఇక శాకుంతలం అయితే ఎన్నో విమర్శలు తీసుకొచ్చింది. అందమైన శాకుంతలంను పేలవంగా చూపించారన్నారు. సామ్‌ వాయిస్‌ మైనస్‌ అయింది. అదిరిపోయే హిట్‌తో కమ్‌ బ్యాక్‌ కావాలని ఐదేళ్ల నుంచి వెయిట్‌ చేస్తోంది సామ్‌.

మహానటిలో విజయ్‌, సామ్‌ జత కట్టారు. హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ కావడం.. రిలీజ్‌కు ముందే ఆడియో హిట్‌ కావడంతో.. ఖుషీపై అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తగ్గట్టే.. 3 రోజుల్లో రూ.70 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసి.. హిట్‌ దశగా దూసుకుపోతోందనుకుంటే.. వసూళ్లు మూడునాళ్ల ముచ్చటే అయింది. సినిమాను రూ.52 కోట్లకు అమ్మితే.. రూ.41 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ట్రీట్‌మెంట్‌ కోసం అమెరికా వెళ్లిన సామ్‌.. పది రోజులకే తిరిగొచ్చేసింది. జెట్‌ ల్యాగ్‌తో వైజాగ్‌లో జరిగిన సెలబ్రేషన్స్‌లో పాల్గొనకపోయినా.. హైదరాబాద్‌లో నిర్వహించే సక్సెస్‌మీట్‌కు వస్తుందని స్వయానా విజయ్‌ దేవరకొండే చెప్పాడు. అయితే.. సినిమా ప్లాప్‌ వైపు యూ టర్న్‌ తీసుకోవడంతో.. సక్సెస్‌మీట్ పెట్టలేదు. మ్యూజిక్‌ ఈవెంట్‌లో రొమాంటిక్‌ డ్యాన్స్‌లా మరోసారి సందడి చేస్తారనుకున్న రౌడీ ఫ్యాన్స్‌ కోరిక తీరలేదు. వాట్‌ నెక్ట్స్‌ అంటే.. సిటాడెల్‌ వెబ్‌సిరీస్‌ రిలీజ్‌ తప్ప సమంత చేతిలో మరో మూవీ లేదు. ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్‌ పార్ట్-1కి మించి వుంటేనే సామ్‌కు పేరొస్తుంది.

ఎంత పేరొచ్చినా.. వెండితెరపై సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అనిపించుకుంటే ఆ మజానే వేరు. సామ్‌కు మళ్లీ ఛాన్స్‌ ఇచ్చేది ఎవరు..? హిట్ వచ్చేది ఎప్పుడు..?అదిగో.. ఇదిగో అంటూ సమంతను బాలీవుడ్‌ చాలాకాలంగా ఊరిస్తోంది. సిటాడెల్‌ హిందీ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెడుతోంది సామ్. ఆల్రెడీ శాకుంతలంతో పాన్‌ ఇండియాలోకి అడుగుపెట్టినా హిట్‌ కాలేదు. సామ్‌కు స్ట్రైట్‌ మూవీ ఛాన్స్‌ కావాలి ఇప్పుడు. ఖుషి తర్వాత సమంత ఏం చేస్తుంది..? అంటే, తెలుగులోనే కాదు.. తమిళంలోనూ ఒక్క సినిమా లేదు. అయితే.. బాలీవుడ్‌లోకి వెళ్తోందన్న టాక్‌ నడుస్తోంది. సమంతతో మంచి అనుబంధం వున్న కరణ్‌ జోహార్‌ సల్మాన్‌తో ఓ సినిమా ప్లాన్‌ చేశాడు. ఇందులో హీరోయిన్‌గా సమంతకు ఛాన్స్‌ ఇచ్చారన్న వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. సల్మాన్‌, కరణ్‌ జోహార్‌ మూవీ దర్శకుడిగా విష్ణు విర్ధన్‌ కన్ఫర్మ్‌ అయినట్టు వార్తలొస్తున్నాయి. అజిత్‌తో బిల్లా.. పవన్‌కల్యాణ్‌తో పంజా తీసిన విష్ణు వర్ధన్‌ షేర్షాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. సమంత ఇంతవరకు హిందీలో నటించకపోయినా.. పుష్పలో ఉ.. అంటావా.. మావా.. సాంగ్‌తో బాగా పాపులర్‌ అయింది. మరి సల్మాన్‌తో బాలీవుడ్‌లోకి వస్తుందేమో చూడాలి.