Samantha: అమెరికా విమానం ఎక్కేసిన సమంత.. యేడాది తరువాతే మళ్లీ స్క్రీన్ పైకి..!
ఇప్పటికే సామ్ అమెరికా ఫ్లైట్ ఎక్కేసింది. మూడు నెలలపాటు ట్రీట్‌మెంటే లోకంగా గడిపేస్తుంది. ఇప్పుడే కాదు.. మరికొంతకాలంపాటు కూడా సమంత వరుసగా చికిత్స తీసుకోవాల్సి ఉంది. దీనికోసం తరచూ అమెరికా వెళ్లాలి. అలాగే సమంతకు విశ్రాంతి కూడా అవసరం.
Samantha: సమంత మున్ముందు ఖుషీ ప్రమోషన్‌లో కనిపించదు. ఇక ఖుషీ ప్రచారమంతా విజయ్ దేవరకొండ చేతుల మీదే సాగుతుంది. అదేంటి.. మ్యూజిక్ ఈవెంట్‌లో కనిపించిందిగా అని అనుమానం కలగొచ్చు. ఈ ఈవెంట్ తర్వాత మూవీ యూనిట్‌కు సమంత అందుబాటులో ఉండటం లేదు. కారణం.. మయోసైటిస్ ట్రీట్‌మెంట్ కోసం సమంత అమెరికా వెళ్లడమే. ఇప్పటికే సామ్ అమెరికా ఫ్లైట్ ఎక్కేసింది. మూడు నెలలపాటు ట్రీట్‌మెంటే లోకంగా గడిపేస్తుంది. ఇప్పుడే కాదు.. మరికొంతకాలంపాటు కూడా సమంత వరుసగా చికిత్స తీసుకోవాల్సి ఉంది. దీనికోసం తరచూ అమెరికా వెళ్లాలి. అలాగే సమంతకు విశ్రాంతి కూడా అవసరం. ఈ నేపథ్యంలో సినిమాలు చేయడం సాధ్యం కాదు. అందుకని దాదాపు ఏడాదిపాటు సినిమాలకు సమంత దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దీనికి అనుగుణంగా కొత్త సినిమాల్ని సమంత కమిట్ అవ్వడం లేదు. వచ్చే ఏడాది కొత్త సినిమాలు ఒప్పుకొంటుంది.
రీసెంట్‌గా జరిగిన ఖుషీ మ్యూజిక్ కన్సర్ట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై హైప్ పెరగడానికి సమంత, విజయ్ డ్యాన్స్ ఉపయోగపడింది. మున్ముందు.. ప్రీ రిఈజ్ ఈవెంట్స్.. ఇంటర్వ్యూస్‌తో ఈ పాన్ ఇండియా మూవీకి మంచి హైప్ వస్తుందని సామ్, విజయ్ ఫ్యాన్స్ ఆశపడ్డారు. అయితే, మయోసైటిస్ ట్రీట్‌మెంట్ కోసం ముందుగానే సమంత డేట్స్ ఫిక్స్ అయిపోవడంతో సామ్ ఇక ప్రమోషన్‌కు రాదనే ఉద్దేశంతోనే మ్యూజిక్ ఈవెంట్ పెట్టారట. సామ్ ఒక్క ప్రమోషన్‌తో సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చింది. ముఖ్యంగా స్టేజ్‌పై సామ్, విజయ్ రొమాంటిక్ డ్యాన్స్‌పై విమర్శలు వచ్చినా.. అంతకంటే ఎక్కువగా.. సినిమాకు యూజ్ అయింది. పాన్ ఇండియా మూవీ కావడంతో చెన్నై, బెంగుళూరు, ముంబై వెళ్లాల్సి వుంది.
అక్కడ కూడా సమంత సందడి చేస్తే రేంజ్ మరింత పెరిగేది. కానీ, ఇప్పుడా అవకాశం లేదు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం తప్పితే.. సామ్ ఇప్పట్లో కనిపించదు. మూడు నెలలపాటు న్యూయార్క్‌లో వుంటూ.. మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటుంది. అందుకే ఇప్పట్లో ఎంజాయ్‌మెంట్ వుండదని, ఆమధ్య బాలి వెళ్లి ఖుషీ అయి వచ్చింది. ఖుషీ మ్యూజిక్ ఈవెంట్‌లో ఎనర్జీతో కనిపించిన సామ్.. ట్రీట్‌మెంట్ తర్వాత మరింత బూస్టప్‌తో ఎలా కనిపిస్తుందో చూడాలి మరి.