Samantha: 4డిగ్రీల చల్లని నీళ్లలో.. సమంత 6నిమిషాల స్నానం..
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉండే సమంత.. తన డెయిలీ లైఫ్ మూమెంట్స్ అన్నింటిని అభిమానులతో పంచుకుంటుంది. మయోసైటిస్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందినా.. ఈ మధ్యే బాలికి వెళ్లి హాయిగా కాలం గడిపినా.. సినిమాలకు కొద్ది రోజులు సెలవు అని అనౌన్స్ చేసినా.. అన్నింటికీ సోషల్ మీడియానే వేదికగా మార్చుకుంది సమంత.
ఇప్పుడు సామ్ పోస్ట్ చేసిన ఓ వీడియో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 4 డిగ్రీల చల్లని నీళ్లలో.. 6నిమిషాల పాటు స్నానం అంటూ ట్యాగ్ పెట్టి సమంత ఈ వీడియో పోస్ట్ చేసింది. మయోసైటిస్ చికిత్స కోసమే సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిందని అంతా అనుకున్నారు. ఐతే మానసిక ప్రశాంతత కోసమే.. బ్రేక్ తీసుకున్నట్లు ఆమె పనులతో అర్థం అవుతోంది. ఈ మధ్యే ఈషా ఫౌండేషన్ కి వెళ్లి ధ్యానం, పూజలు చేసిన సమంత.. ఇప్పుడు ఇండోనేషియాలోని బాలిలో ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేస్తుంది. రెండు రోజులుగా ఇండోనేషియాలోని బాలిలో తన స్నేహితురాలితో కలిసి ఎంజాయ్ చేస్తుంది.
బాలిలో లోకేషన్లన్నింటిని చుట్టేస్తోంది. మనశ్శాంతి ఇచ్చే ప్రయత్నాలు, ప్రయోగాలు అన్ని చేస్తుంది సామ్. ఇక అక్కడే సహజసిద్ధమైన చికిత్సలను కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పడుు చల్లటి నీళ్ళల్లో స్నానం చేస్తున్న ఫోటోని షేర్ చేసింది సమంత. 4 డిగ్రీల చల్లటి నీళ్లలో ఆరు నిమిషాల పాటు స్నానం చేశానని నీళ్ళల్లో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్న ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది సామ్. దానికి ఐస్ బాత్ అని పోస్ట్ చేసింది. అయితే ఇది కూడా ఆరోగ్యం కోసమే అంట. చల్లటి నీళ్ళల్లో చేస్తే శరీరం ఉత్తేజకరంగా మారుతుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. మొత్తానికి సమంత ఆరోగ్యం, మనశ్శాంతి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ దేశాలు తిరిగేస్తుంది.