Samantha: శోభిత, నాగచైతన్యల డేటింగ్‌ వార్తలపై సమంత ట్విట్టర్‌ వేదికగా క్లారిటీ..

శోభిత, నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నారా.? ఇప్పుడు ఈ అంశం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మొన్నటి మొన్న లండన్‌లోని ఓ హోటల్‌లో నాగచైతన్య ఉన్న హోటల్‌లో శోభిత కూడా ఉన్నట్లున్న ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీరి రిలేషన్‌షిప్‌పై సమంత స్పందించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను సామ్‌ ఖండించారు. తాను ఎప్పుడూ అలా అనలేదని స్పష్టతనిచ్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 4, 2023 | 07:15 PMLast Updated on: Apr 04, 2023 | 7:15 PM

Samantha Tweet About Shobita Chaitanya

ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌ లింక్‌ను కోట్‌ చేస్తూ సమాధానం ఇచ్చారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. సమంత కథానాయికగా నటించిన ‘శాకుంతలం’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా రిలేషన్‌షిప్‌ వార్తలపై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ‘ఎవరు ఎవరితో రిలేషన్ షిప్‌లో ఉన్నారనే దాని గురించి నేను బాధపడటం లేదు.

ప్రేమ విలువ తెలియని వారికి ఎంతమందితో సంబంధం ఉన్నా కూడా కన్నీళ్లు మిగులుతాయి. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. అతని ప్రవర్తన మార్చుకుని అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది’ అని సమంత అన్నట్లు వార్తలు వెలువడ్డాయి. నాగచైతన్య-శోభిత రిలేషన్‌షిప్‌పైనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు ప్రచురించారు. దీనిపై స్పందించిన సామ్‌ తాను ఎప్పుడూ అలా అనలేదని సమాధానం ఇచ్చారు.