ఆ హీరోకు దగ్గరైన సమంతా… వద్దంటున్న ఫ్యాన్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా ఇప్పుడు మళ్ళీ లవ్ లో పడిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గత కొన్నాళ్ళుగా సమంతా ఒంటరిగా ఉంటూ సినిమాలపై ఫోకస్ చేస్తోంది. నాగ చైతన్య నుంచి దూరమైన తర్వాత సమంతా పెద్దగా సెకండ్ మ్యారేజ్ పై ఫోకస్ చేయలేదు అనే చెప్పాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 28, 2024 | 12:01 PMLast Updated on: Nov 28, 2024 | 12:01 PM

Samantha Who Is Close To That Hero Fans Are Saying No

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా ఇప్పుడు మళ్ళీ లవ్ లో పడిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గత కొన్నాళ్ళుగా సమంతా ఒంటరిగా ఉంటూ సినిమాలపై ఫోకస్ చేస్తోంది. నాగ చైతన్య నుంచి దూరమైన తర్వాత సమంతా పెద్దగా సెకండ్ మ్యారేజ్ పై ఫోకస్ చేయలేదు అనే చెప్పాలి. ఇప్పుడు సినిమా ఆఫర్లు భారీగా రావడంతో మళ్ళీ కెరీర్ ను గాడిలో పెట్టుకుని దూసుకుపోతోంది. అగ్ర హీరోయిన్ గా టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ఉన్నా సరే బాలీవుడ్ లో బిజీ అవుతోంది. వెబ్ సీరీస్ లతో మంచి ఆఫర్లు కొట్టేస్తోంది.

రీసెంట్ గా వరుణ్ ధావన్ తో కలిసి ఆమె చేసిన ఒక వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సీరీస్ తర్వాత ఓ స్టార్ హీరో భారీ బడ్జెట్ సినిమాలో కీ రోల్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక కెరీర్ పరంగా మళ్ళీ తెలుగుపై ఆమె ఫోకస్ చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చిందని… గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఈ టైం లో కాస్త ఇంటర్వ్యూలు టాక్ షోస్ తో సంచలన వ్యాఖ్యలు చేస్తోంది సమంతా. తాజాగా ఆమె పరోక్షంగా నాగ చైతన్య పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఇప్పుడు మరోసారి సమంతా వార్తల్లో నిలిచింది. సింగిల్ గా ఉంటున్న సమంతా ఓ స్టార్ హీరోకు బాగా దగ్గరైంది అంటూ ప్రచారం మొదలయింది. బాలీవుడ్ యంగ్ హీరో… అర్జున్ కపూర్ తో ఆమె ప్రేమలో పడినట్టు బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. గత కొన్నాళ్ళుగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. మాజీ హీరోయిన్ మలైకా అరోరాతో అతను కొన్నాళ్ళు లవ్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఆమెకు బ్రేకప్ చెప్పి ఇప్పుడు సమంతాకు బాగా దగ్గరయ్యాడని అంటున్నారు. ఇద్దరూ కలిసి ఓ సినిమా కూడా చేస్తున్నారట.

కుదిరితే అతన్నే వివాహం కూడా చేసుకునే అవకాశం ఉందనే రూమర్ కూడా వస్తోంది. ఇది తెలిసిన ఫ్యాన్స్ సమంతాను… అసలు మళ్ళీ తప్పు చేయవద్దు అని కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని సినిమాలు చేసుకుని ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలి అని సూచిస్తున్నారు. దయచేసి ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో రిస్క్ చేయకు అంటూ సమంతాకు సున్నితంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వరుణ్ ధావన్ తో కూడా ఆమెకు ఏదో రిలేషన్ ఉన్నట్టు ప్రచారం జరిగింది కొన్నాళ్ళు. అయితే నాగ చైతన్యపై కోపంతోనే ఆమె అర్జున్ కపూర్ కు దగ్గరైంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.