Samantha Pregnant : సమంతా ప్రెగ్నెంట్ ?
సినిమా వాళ్ళు ఏది చేసినా కాస్త వింతగానే ఉంటుంది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ కోసం వాళ్ళు కాస్త ఎక్కువగా క్రియేటివిటి చూపించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
సినిమా వాళ్ళు ఏది చేసినా కాస్త వింతగానే ఉంటుంది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ కోసం వాళ్ళు కాస్త ఎక్కువగా క్రియేటివిటి చూపించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ మధ్య కాలంలో సినిమాలు (Movies) జనాల్లోకి వెళ్ళాలన్నా, సోషల్ మీడియా (Social media) లో జనాలు వాటి గురించి మాట్లాడుకోవాలన్నా సరే ఇలా కాస్త డిఫరెంట్ గానే ప్రమోషన్ చేయాలి అంటున్నారు సినీ జనాలు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమంతా చేసిన ఒక ప్రమోషన్ బాగా హాట్ టాపిక్ అయింది. అసలు ఆమె ఏం చేసింది ఏంటీ అనేది ఈ స్టోరీలో చూద్దాం.
నాగ చైతన్య (Naga Chaitanya) నుంచి 2021 లో విడాకులు (Divorce) తీసుకున్న తర్వాత ఒంటరిగా ఉంటున్న సమంతా ఇప్పుడు సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. బాలీవుడ్ (Bollywood) లో కూడా వరుసగా సినిమాలు చేసేస్తుంది. ఐటెం సాంగ్స్ (Item Songs) విషయంలో కూడా ఈ అమ్మడు ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా బాలీవుడ్ లో ఒక వెబ్ సీరీస్ లో వరుణ్ ధావన్ (Varun Dhawan) తో కలిసి నటించింది. హనీ (Bunny) బన్నీ అనే టైటిల్ తో వస్తున్న ఈ సీరీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. త్వరలోనే దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పుడు ఈ సీరీస్ కు ప్రమోషన్ స్టార్ట్ చేసింది సాం..
కారులో కూర్చుని ఉన్న ఒక ఫోటోని ఆమె తన ఇంస్టాగ్రామ్ (Instagram) లో పోస్ట్ చేసింది. అందులో ఆమె ఒక స్లిప్ చూపిస్తూ స్మైల్ ఇస్తుంది. అది చూడటానికి ప్రెగ్నెన్సీ కిట్ లా ఉండటంతో అందరూ ముందు షాక్ అయ్యారు. ఏంటి సమంతా ప్రెగ్నెంట్ అయిందా అంటూ కాసేపు కంగుతిన్నారు. రెండో ఫోటో చూసిన తర్వాత జనాలకు ఒక ఐడియా వచ్చింది. దాని మీద ‘ఆగస్టు 8న హనీ ని కలవండి’ అని రాసి ఉండటంతో ఓకే ఇది వెబ్ సీరీస్ (Web series) ప్రమోషన్ అని జనాలు క్లారిటీకి వచ్చారు. సిటాడెల్ అనే టైటిల్ తో వస్తుందనుకున్న ఈ వెబ్ సీరీస్ ఇప్పుడు హనీ బన్నీతో వస్తుంది.