Samantha’s : సమంత రెండో పెళ్లిపై ఓపెన్..

హీరోయిన్‌ సమంత ఇప్పుడు సినిమాలకు ప్రస్తుతానికి గుడ్‌బై చెప్పి తన ఆరోగ్యంపైనే పూర్తి దృష్టి పెట్టింది. మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్న సమంత 6 నెలలుగా అమెరికాలోనే ఉంటూ చికిత్స తీసుకుంటోంది. ఎక్సర్‌సైజులు చేస్తూ పర్‌ఫెక్ట్‌ డైట్‌ను ఫాలో అవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 18, 2023 | 02:53 PMLast Updated on: Dec 18, 2023 | 2:53 PM

Samanthas Interesting Comments On Her Second Marriage

హీరోయిన్‌ సమంత ఇప్పుడు సినిమాలకు ప్రస్తుతానికి గుడ్‌బై చెప్పి తన ఆరోగ్యంపైనే పూర్తి దృష్టి పెట్టింది. మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్న సమంత 6 నెలలుగా అమెరికాలోనే ఉంటూ చికిత్స తీసుకుంటోంది. ఎక్సర్‌సైజులు చేస్తూ పర్‌ఫెక్ట్‌ డైట్‌ను ఫాలో అవుతోంది. చాలా వరకు బ్యూటీ ఆరోగ్యం మెరుగుపడిందని తెలుస్తోంది. అయితే చిన్నదాని నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఏమిటి అనేది క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. ఫ్యాన్స్‌తో మాత్రం రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటోంది. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్‌ అవుతోంది. తనకు సంబంధించిన అనేక విషయాలను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటోంది.

ఇటీవల బ్యూటీ నిర్వహించిన లైవ్‌లో ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ‘మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదా’ అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ ‘స్టాటిస్టిక్స్‌ ప్రకారం.. అదో చెడ్డ పెట్టుబడి’ అని చెప్పుకొచ్చింది. అంతేకాక విడాకులకు సంబంధించిన కొన్ని లెక్కలను సైతం పోస్ట్ చేశారు. ఆ పోస్టులో.. ‘‘ మొదటి పెళ్లికి సంబంధించి విడాకుల రేటు దాదాపు 50 శాతంగా ఉంది. అదే విధంగా రెండో పెళ్లికి సంబంధించి విడాకుల రేటు 67 శాతంగా ఉంది. ఈ విషయంలో స్త్రీలు, పురుషులు సమానమే అని లెక్కలు చెబుతున్నాయి’ అని సమాధానమిచ్చింది.

ఇక మరో నెటిజన్ ‘మీ నెక్ట్స్ ఇయర్‌ ప్లాన్స్‌ ఏమిటి’ అని అడిగిన ప్రశ్నకు ‘మంచి ఆరోగ్యం’ అంటూ రెండు ముక్కల్లో ఆన్సర్‌ ఇచ్చింది. దీన్నిబట్టి మళ్ళీ పెళ్లి చేసుకునే విషయంలో సమంత ఫుల్‌ క్లారిటీతో ఉందని అర్థమవుతోంది. అంతేకాదు, పెళ్లి కంటే తన ఆరోగ్యంపైనే ఆమె ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్టుగా ఉంది. ఇక సమంత ‘సిటడెల్‌’ అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది. షూటింగ్‌ పూర్తయినప్పటికి విడుదల తేదీ అయితే ఖరారు కాలేదు. వీటితో పాటు ‘ చెన్నై స్టోరీస్‌’ అనే ఇంగ్లీష్‌ మూవీలో కూడా నటించబోతున్నారు. ఈ చిత్రంతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.