సమంతా సంచలన నిర్ణయం, ఆస్తి మొత్తం అనాధల కోసం రాస్తుందా…?
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమంతా ఇప్పుడు నేషనల్ లెవెల్ హీరోయిన్ అయిపోయింది. సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి 15 ఏళ్ళు దాటినా ఈ భామ మాత్రం ఎక్కడ దూకుడు తగ్గించడం లేదు.

Samantha, who is single after her divorce from Naga Chaitanya in 2021, will now focus more on films.
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమంతా ఇప్పుడు నేషనల్ లెవెల్ హీరోయిన్ అయిపోయింది. సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి 15 ఏళ్ళు దాటినా ఈ భామ మాత్రం ఎక్కడ దూకుడు తగ్గించడం లేదు. బాలీవుడ్ లో కూడా జెండా బలంగా పాతాలని డిసైడ్ అయిపొయింది. వరుస సినిమాలకు వెబ్ సీరీస్ లకు సైన్ చేసేస్తుంది. స్కిన్ షో విషయంలో నాకేం పరిమితులు లేవు డైరెక్టర్ ఏం చెప్తే అదే అంటూ కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది. త్వరలోనే ఆమె నటించిన వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
అంత వరకు బాగానే ఉంది గాని ఈ భామ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు భోగట్టా. సేవా కార్యక్రమాల్లో సమంతాది పెద్ద చేయి. ముందు నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో ఎక్కడా వెనకడుగు వేయదు. చిన్న చిన్న పిల్లలకు ఎక్కువగా ఆర్ధిక సహాయం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏకంగా అందరిని షాక్ కి గురి చేసే నిర్ణయం తీసుకుంది. తన ఆస్తుల్లో దాదాపుగా 60 శాతం నాలుగు అనాధ ఆశ్రమాలకు రాసేయాలని, వాటి పై వచ్చే ఆదాయం మొత్తం కూడా వారికే చెందే విధంగా రాయించాలని ఆమె భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.
ఇందుకోసం ఆమె ఒక చార్టెడ్ ఎకౌంటెంట్ తో చర్చలు జరుపుతున్నట్టు సినీ వర్గాలు అంటున్నాయి. కుటుంబ సభ్యులను కూడా ఇందు కోసం ఆమె ఒప్పించింది. వాటిపై వచ్చే ఆదాయంతో వారికి సంబంధించిన చదువు, వివాహం, ఆరోగ్యం, వ్యక్తిగత అవసరాల ఖర్చులు తీర్చాలని సమంతా నిర్ణయం తీసుకోనుంది. తమిళనాడుకి చెందిన ఒక లాయర్ కు ఈ బాధ్యత అప్పగించింది సమంతా అని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ఏది ఎలా ఉన్నా సమంతా తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం టాలీవుడ్ నే కాదు తమిళ సినిమా పరిశ్రమను కూడా షాక్ కు గురి చేస్తుంది. సమంతా గట్స్ కు హ్యాట్సాఫ్ చెప్తున్నాయి సినీ వర్గాలు.