సమంత స్పెషల్‌ న్యూస్‌ ఏంటంటే…

చైతూ, శోభిత ఎంగేజ్‌మెంట్ తర్వాత.. సమంత ఏం చేసినా.. ఏం రాసినా.. ఏ ఫొటో పెట్టినా.. ఆ ఎంగేజ్‌మెంట్‌కు లింక్ చేస్తూ రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు ఫ్యాన్స్. సర్‌ప్రైజ్‌.. స్పెషల్‌ న్యూస్ చెప్తా అంటూ సమంత పెట్టిన ఇన్‌స్టా స్టోరీ మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 20, 2024 | 05:20 PMLast Updated on: Aug 20, 2024 | 5:20 PM

Samanthas Special News Is

చైతూ, శోభిత ఎంగేజ్‌మెంట్ తర్వాత.. సమంత ఏం చేసినా.. ఏం రాసినా.. ఏ ఫొటో పెట్టినా.. ఆ ఎంగేజ్‌మెంట్‌కు లింక్ చేస్తూ రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు ఫ్యాన్స్. సర్‌ప్రైజ్‌.. స్పెషల్‌ న్యూస్ చెప్తా అంటూ సమంత పెట్టిన ఇన్‌స్టా స్టోరీ మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. సామ్‌ దేని గురించి చెప్పబోతుందా అని జోరుగా చర్చ జరిగింది కూడా ! నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత.. కొద్దిరోజులకే సమంత కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయ్. ఐతే రాజ్ డీకే దర్శక ద్వయంలోని రాజ్‌తో సమంత ప్రేమలో ఉందని.. బాలీవుడ్ కోడై కూస్తోంది.

ఇలాంటి వార్తల మధ్య… స్పెషల్ న్యూస్ అని సమంత స్టోరీ పెట్టగానే.. కొత్త జీవితానికి సంబంధించి అప్డేట్ ఇస్తుందేమోనని అందరూ అనుకున్నారు. ఐతే సామ్‌ మాత్రం వరల్డ్ పికిల్ బాల్ లీగ్ ప్రెస్ మీట్‌లో మెరిసింది. ఆమె చెప్పాలనుకున్న స్పెషల్ విషయం ఇదేనని తెలుస్తోంది. ఈ ఈవెంట్ ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. వరల్డ్ పికిల్ బాల్ లీగ్‌కి సంబంధించిన అనేక విషయాలను ఈవెంట్‌లో చెప్పింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.. ఇక అటు సినిమాల విషయానికి వస్తే సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఆమె చేసిన సిటాడెల్ హనీ బన్నీ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. రాజ్- డీకే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ సమంతను మళ్లీ బిజీ చేస్తుందని ఆమె బలంగా నమ్ముతోంది.