అంతా ఫేక్.. చూపించేది తప్పుడు కలెక్షన్స్.. కాక పుట్టిస్తున్న సందీప్ కిషన్ కామెంట్స్..!
మా సినిమాకు మొదటి రోజు 100 కోట్లు వచ్చాయి.. 2 రోజులకు 300 కోట్లు వచ్చాయి.. 4 రోజులకు 500 కోట్లు వచ్చాయి అంటూ నిర్మాతలు ఇష్టం వచ్చినట్టు పోస్టర్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు.

మా సినిమాకు మొదటి రోజు 100 కోట్లు వచ్చాయి.. 2 రోజులకు 300 కోట్లు వచ్చాయి.. 4 రోజులకు 500 కోట్లు వచ్చాయి అంటూ నిర్మాతలు ఇష్టం వచ్చినట్టు పోస్టర్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. వీటిని చూసి ఫాన్స్ నిజమని నమ్ముతున్నారు కానీ కామన్ ఆడియన్స్ మాత్రం ఇదంతా ఫేక్ అని ఈజీగానే అర్థం చేసుకుంటున్నారు. ఈ కలెక్షన్స్ స్కాంపై ఈమధ్య సంక్రాంతికి వస్తున్నాం డిస్ట్రిబ్యూటర్స్ మీట్ లో నిర్మాత దిల్ రాజు సహా మిగిలిన బయ్యర్లు కూడా.. అసలు లెక్కలు అన్ని బయటపెట్టారు. ఇండస్ట్రీలో తప్పుడు కలెక్షన్లు చూపించడంలో ఎంత పెద్ద స్కామ్ జరుగుతుందో వివరంగా చెప్పారు. ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇదివరకు వేసిన వందల కోట్ల కలెక్షన్ పోస్టర్స్ తలుచుకొని నవ్వుకుంటున్నారు ప్రేక్షకులు. అప్పుడు జరిగిన ఈ ప్రెస్ మీట్ మీద ఇండస్ట్రీ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరిగింది కూడా.
తాజాగా సేమ్ ఇదే అంశంపై హీరో సందీప్ కిషన్ కూడా మాట్లాడాడు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫేక్ కలెక్షన్స్ తో పాటు ఇండస్ట్రీలో పిఆర్ అనేది ఎంత ముఖ్యం అనే విషయం చాలా క్లారిటీగా చెప్పాడు సందీప్ కిషన్. మజాకా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు అన్ని ఇండస్ట్రీలో కూడా కేవలం పిఆర్ హీరోలను ముందుకు నడిపిస్తుంది అని చెప్పాడు. సరైన పిఆర్ లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా కూడా వెనకబడిపోతాడు అని చెప్పాడు సందీప్. అంతేకాదు సినిమాలకు వస్తున్న కలెక్షన్స్ మీద కూడా ఆయన ఓపెన్ గా మాట్లాడాడు. ఒక సినిమాకు నేనే నిర్మాత, నేనే డిస్ట్రిబ్యూటర్ అయినప్పుడు డబ్బులు వచ్చినా రాకపోయినా కూడా పదిమంది పెద్దవాళ్లతో నా సినిమాకు ఇన్ని వందల కోట్లు వచ్చాయి అని చెప్పిస్తాను.. అలాంటప్పుడు వందలో 40 మంది ఈ కలెక్షన్స్ చూసి నవ్వుకున్నా.. మిగిలిన 60 మంది మాత్రం సినిమా హిట్ అని నమ్ముతారు. ఇండస్ట్రీలో ఇప్పుడు కావాల్సింది అదే అని చెప్పాడు సందీప్ కిషన్.
ఈయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా పెద్ద సినిమాలకు రిలేట్ అవుతున్నాయి. ఎందుకంటే సినిమాలు హిట్టు ఫ్లాపు పక్కన పెట్టి మొదటి రోజే 100 నుంచి 200 కోట్ల పోస్టర్స్ విడుదల చేస్తున్నారు నిర్మాతలు. పది రోజుల్లోనే 1000 కోట్లు వచ్చాయని చెప్తున్నారు. అంతెందుకు ఇంకా తేడాది చాలా పెద్ద హిట్ అని చెప్పుకుంటున్న సినిమాలకు కూడా మాకు డబ్బులు మిగల్లేదు అని సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ లో డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం సంచలనంగా మారింది. ఇప్పుడు సందీప్ కిషన్ కూడా ఇదే మాట మాట్లాడడంతో ఇండస్ట్రీలో నిజంగా హిట్ సినిమాలు వస్తున్నాయా.. లేదంటే మొత్తం అంతా ఫేక్ కలెక్షన్స్ రాజ్యం నడుస్తుందా అనే అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి.