Kiran Rao VS Sandeep Reddy Vanga : అమీర్ భార్యకు.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్
యానిమల్ మూవీ.. వసూళ్ల రికార్డులు క్రియేట్ చేసింది. వాట్ ఏ విజన్.. వాట్ ఏ థాట్ అంటూ.. డైరెక్టర్ (Director) సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) మీద ప్రశంసలు గుప్పిస్తున్నారు సినిమా చూసినవాళ్లంతా ! ఆయన సినిమాలు అన్నీ బోల్డ్‌గానే ఉంటాయ్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ నుంచి.. యానిమల్ (Animal) వరకు.. అన్నీ సేమ్ స్టైల్ ! 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్‌తో థియేటర్లలో రిలీజ్ అయిన యానిమల్ మూవీ.. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

Sandeep Reddy is Vanga's counterpart to Aamir Khan's wife in the Animal movie controversy
యానిమల్ మూవీ.. వసూళ్ల రికార్డులు క్రియేట్ చేసింది. వాట్ ఏ విజన్.. వాట్ ఏ థాట్ అంటూ.. డైరెక్టర్ (Director) సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) మీద ప్రశంసలు గుప్పిస్తున్నారు సినిమా చూసినవాళ్లంతా ! ఆయన సినిమాలు అన్నీ బోల్డ్‌గానే ఉంటాయ్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ నుంచి.. యానిమల్ (Animal) వరకు.. అన్నీ సేమ్ స్టైల్ ! 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్‌తో థియేటర్లలో రిలీజ్ అయిన యానిమల్ మూవీ.. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. సినిమా ఫస్ట్ డే నుంచే.. ఫుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది. యానిమల్ మూవీలోని క్లిప్స్, డైలాగ్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశాయ్. మీమ్స్ కూడా ట్రెండ్ క్రియేట్ చేశాయ్.
జమాల్ కుడు, బీజీఎమ్ స్కోర్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. యానిమల్ మూవీ 9వందల కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. రిపబ్లిక్ డే సందర్భంగా.. నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో యానిమల్ మూవీ చూసిన సెలబ్రిటీలు విమర్శలు చేస్తున్నారు. అదేం సినిమా అంటూ పలు కామెంట్స్‌తో తమ రివ్యూ ఇచ్చారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా యానిమల్ మూవీపై రియాక్ట్ అయింది. బోల్డ్ కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయంటూ ట్వీట్ చేసింది. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. కిరణ్ రావు చేసిన కామెంట్స్‌పై..
ఆమె పేరు ఎత్తకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్. బాహుబలి 2, కబీర్ సింగ్ లాంటి సినిమాలు స్త్రీ వ్యతిరేకతను, వేధింపులను ప్రోత్సహిస్తున్నాయని ఆమె అంటున్నారని.. వేధింపులకు, దగ్గరవడానికి మధ్య తేడా బహుశా ఆమెకు తెలియదనుకుంటా అంటూ కౌంటర్ ఇచ్చాడు. కిరణ్‌రావుకు ఒకటే చెప్పాలనుకుంటున్నా.. అమీర్ ఖాన్ నటించిన దిల్ సినిమాలో అమ్మాయిపై అత్యాచారన్ని ప్రేరేపించే సీన్ ఉంటుంది. ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. అంతా జరిగినా చివరికీ అతడితోనే ఆమె ప్రేమలో పడుతుంది. మరి దీన్ని ఏమంటారు. ఇలాంటివి చూడకుండా ఎలా కామెంట్స్ చేస్తారో అర్థం కావడం లేదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు సందీప్ కామెంట్స్.. తెగ ట్రెండ్ అవుతున్నాయ్.