Sandeep Reddy Vanga: వివాదాల్లో దర్శకులు.. సందీప్, సిద్ధార్థ్‌పై విమర్శలు
షారుఖ్‌తో పఠాన్ మూవీ తీస్తే దానికి వెయ్యికోట్లొచ్చాయి. అప్పుడు హిట్ ఇవ్వగానే ఆడియన్స్ నచ్చారు. ఇప్పుడు ఫ్లాప్ పడగానే ఆడియన్స్ తెలివితక్కువాళ్లలా కనిపిస్తున్నారా అంటూ నెటిజన్స్ తెగ తిట్టేస్తున్నారు దర్శకుడిని.

Sandeep Reddy Vanga: బాలీవుడ్‌లో వార్, బ్యాంగ్ బ్యాంగ్, పఠాన్ మూవీలు తీసిన డైరెక్టర్ సిద్దార్ ఆనంద్. తను తీసిన హ్రితిక్ రోషన్ మూవీ ఫైటర్. ఇది ఫ్లాప్ కాదు.. ఏకంగా డిజాస్టర్ అయ్యింది. దీంతో అసలు ఆడియన్స్‌కి టేస్ట్ లేదు, వాళ్లకి సినిమాను చూడ్డం రాదని నోరు జారాడు సిద్దార్ధ్ ఆనంద్. ప్రేక్షకులకు విమానాల గురించి తెలియకపోవడం వల్లే సినిమా ఫ్లాప్ అయ్యిందన్నాడు. అంతే.. వెంటనే సోసల్ మీడియాలో ట్రోలింగ్స్ షురూ అయ్యాయి.
MEGASTAR CHIRANJEEVI: చిరుతో సందీప్ రెడ్డి వంగ మూవీ.. కానీ, సినిమా వచ్చేది అప్పుడే..
షారుఖ్‌తో పఠాన్ మూవీ తీస్తే దానికి వెయ్యికోట్లొచ్చాయి. అప్పుడు హిట్ ఇవ్వగానే ఆడియన్స్ నచ్చారు. ఇప్పుడు ఫ్లాప్ పడగానే ఆడియన్స్ తెలివితక్కువాళ్లలా కనిపిస్తున్నారా అంటూ నెటిజన్స్ తెగ తిట్టేస్తున్నారు దర్శకుడిని. ఇది ఇలా చిలికి చిలికి గాలివానలా మారితే, సందీప్ రెడ్డి వంగ కౌంటర్ అలానే షాక్ ఇస్తోంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మాజీ భార్య రీసెంట్‌గా యానిమల్ చూసింది.
స్త్రీ మీద ద్వేషం పెంచేలా ఉందా మూవీ అంటూ ఫైర్ అయ్యింది. దీనికి కౌంటర్‌గా ఓసారి మీ మాజీ భర్త తీసిన దిల్ మూవీలో రేప్ సీన్ చూడమనే అర్ధం వచ్చేలా కౌంటర్ ఇచ్చాడు సందీప్. ఇది ఇప్పుడు చిలికి చిలికి గాలివాన.. కాదు ఏకంగా తుఫాన్ అవుతోంది.