Sandeep Reddy Vanga: 300 కోట్ల లాభాలతో లెక్క మార్చిన సందీప్ రెడ్డి వంగ

యానిమల్ రూ.600 కోట్ల వసూళ్లలో పెట్టుబడి పోను మిగతా రూ.400 కోట్లలో సగం సగం కింద, సందీప్ రెడ్డి వంగకి రూ.200 కోట్లు సొంతమయ్యాయి. తన అన్న యూఎస్ జాబ్ వదులుకుని నిర్మాతగా మారటం వల్ల తన కెరీర్ పోయినా, కోట్లు మాత్రం సొంతమయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 11, 2023 | 08:07 PMLast Updated on: Dec 11, 2023 | 8:07 PM

Sandeep Reddy Vanga Animal Movie Collected Crores And Sandeep Got Rs 300 Cr

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు రూ.300 కోట్లు సొంతం చేసుకున్నాడు. అందులో రూ.200 కోట్లు కేవలం యానిమల్ మూవీ పుణ్యమాని దక్కిందే. ఇంకా ఈ సినిమా వసూళ్లు ఆగలేదు. కాబట్టి ఈజీగా రూ.1000 కోట్లు క్లబ్‌లో ఈ మూవీ చేరేలా ఉంది. అదే జరిగితే మరో రూ.200 కోట్లు అదనంగా తనకి సొంతమయ్యే ఛాన్స్ ఉంది. నిజానికి అర్జున్ రెడ్డి మూవీతో దర్శకుడిగా ఫోకస్ అయిన సందీప్ రెడ్డి.. ఆ సినిమా ప్రొడ్యూస్ చేసేందుకు 32 ఎకరాల భూమిని.. కోటిన్నరకు అమ్మాడు.

Sankranti : ఈ సంక్రాంతి రేస్ లో 6 సినిమాలు.. రచ్చ రచ్చే

అలా వచ్చిన డబ్బు పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. అలా చేసిన రిస్క్ వల్లే అర్జున్ రెడ్డి వచ్చింది. అది పేరుతో పాటు తనకి డబ్బుకూడా తెచ్చింది. అయితే అర్జున్ రెడ్డి వల్ల సందీప్ రెడ్డి వంగ మాత్రం పెద్దగా లాభపడలేదు. అర్జున్ రెడ్డిని తీసిన వెంటనే రైట్స్ రూపంలో రూ.4 కోట్లకే అమ్మేశాడు. కాబట్టి అది రిలీజై 30 కోట్లు వసూలైనా తనకి దక్కిందేంలేదు. అదే అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్‌గా హిందీలో రీమేక్ చేస్తే.. అక్కడ మాత్రం రూ.350 కోట్ల వసూల్లొచ్చాయి. అందులో రూ.100 కోట్లు తనకి లాభంలో వాటా రూపంలో దక్కింది. తర్వాత యానిమల్ రూ.600 కోట్ల వసూళ్లలో పెట్టుబడి పోను మిగతా రూ.400 కోట్లలో సగం సగం కింద, సందీప్ రెడ్డి వంగకి రూ.200 కోట్లు సొంతమయ్యాయి.

తన అన్న యూఎస్ జాబ్ వదులుకుని నిర్మాతగా మారటం వల్ల తన కెరీర్ పోయినా, కోట్లు మాత్రం సొంతమయ్యాయి. యానిమల్ తాలూకు 50 పర్సెంట్ షేర్ అయిన 200 కోట్లలో రూ.150 కోట్లు సందీప్‌కి వెళితే, రూ.50 కోట్లు తన అన్న ప్రణయ్ రెడ్డికి దక్కుతున్నాయట. ఇంకా యానిమల్ వసూల్లు వస్తూనే ఉన్నాయి. కాబట్టి, అవి పెరిగితే వాటిలో కూడా వాటా దక్కుతుంది. మొత్తానికి 32 ఎకరాలు పోయినా రూ.300 కోట్ల లాభాలతో 300 ఎకరాలు తీసుకోవాలనే సందీప్ డ్రీమ్ తీరబోతోందట.