Animal: యానిమల్ కోసం హాలీవుడ్ సీన్స్ ఎత్తేశారా..?
ఈ సీన్స్ అన్నీ.. కొన్ని హాలీవుడ్ మూవీస్ నుంచి కాపీ చేశారనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువైంది. యానిమల్ నుంచి అమ్మాయే.. సాంగ్‌ని రీసెంట్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. ఫ్లైట్ కాక్ పిట్‌లో లిప్ లాక్ కిస్‌లతో రెచ్చిపోయారు రణ్ బీర్, రష్మిక మందన్న.
Animal: ఒకప్పుడు హాలీవుడ్ మూవీస్ నుంచి సీన్స్ కాపీ కొట్టినా పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఓటీటీ దెబ్బకి సీన్ రివర్స్ అయింది. ఓ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్.. రిలీజవటమే లేటు. ఏ సినిమా నుంచి కాపీ చేశారో తెల్చేస్తున్నారు నెటిజన్స్. స్క్రీన్ షాట్స్‌ని తెరపైకి తెచ్చి ట్రోల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇలాంటి కాపీ మరకలకే సెంటర్ అయింది యానిమల్ మూవీ. పఠాన్, జవాన్, టైగర్ 3 తర్వాత బాలీవుడ్‌లో అంతే అంచనాలున్న మూవీ యానిమల్. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు కావడంతో ఇతర భాషల్లోనూ భారీ బజ్ ఏర్పడింది.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ బ్రాండ్ బాగా పని చేస్తోంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ చూశాక బిజినెస్ వర్గాల్లో హైప్ ఒక్కసారిగా పెరిగింది. ముందు సౌమ్యుడిగా ఉంటూ తర్వాత తండ్రి కోసం మరణ శాసనాలు రాసే గ్యాంగ్ స్టర్‌గా మారిపోయే ప్రాసెస్‌ను సందీప్ ఇంటెన్స్‌గా తెరకెక్కించాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ సీన్స్ అన్నీ.. కొన్ని హాలీవుడ్ మూవీస్ నుంచి కాపీ చేశారనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువైంది. యానిమల్ నుంచి అమ్మాయే.. సాంగ్‌ని రీసెంట్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. ఫ్లైట్ కాక్ పిట్‌లో లిప్ లాక్ కిస్‌లతో రెచ్చిపోయారు రణ్ బీర్, రష్మిక మందన్న. అయితే ఇది ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఫిఫ్టీ షేడ్స్ అఫ్ గ్రేలో హెలికాఫ్టర్ సీన్ అని కాంమెట్ చేస్తున్నారు నెటిజన్స్. యానిమల్ ప్రీ టీజర్ లో తడిసిన చొక్కాతో చేతిలో చిన్న గొడ్డలి పట్టుకుని హీరో చేసే ఊచకోత కూడా కొరియన్ మూవీ ఓల్డ్ బాయ్ నుంచి తీసుకున్నదని పోలికలు చూపిస్తున్నారు. దీంతో ఈ మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ఇలాంటి మాఫియా కథలకి రెఫెరెన్స్ బుక్ గాడ్ ఫాదర్. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో బ్లాక్ బస్టర్లు వచ్చాయి. కాబట్టి యానిమల్‌లో కొన్ని సెకండ్ల పుటేజ్ చూసి వెంటనే ఒక నిర్థారణకు రాలేం అంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. మరి ట్రైలర్‌లో ఈ కాపీ మరకలకి సందీప్ ఎమైనా చెక్ పెడతడేమో చూడాలి.