SANDEEP REDDY VANGA: ప్రభాస్ కంట్లో గుంటూరు కారం కొట్టేస్తున్న సందీప్ రెడ్డి?
స్పిరిట్ మూవీ ఆఫర్ ప్రభాస్ ఎప్పుడో ఇస్తే, ఇప్పుటికీ ఈ మూవీ తాలూకు కథా పనులు మొదలు పెట్టలేదు సందీప్ రెడ్డి. ఇంకా యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ కథనే రాస్తూ ఫిబ్రవరి నెలలో బిజీ అయ్యాడని తెలుస్తోంది.

SANDEEP REDDY VANGA: రెబల్ స్టార్ కంట్లో గుంటూరు కారం అన్న స్టేట్మెంట్ విచిత్రంగా ఉన్నా, సందీప్ రెడ్డి వంగ మీద కోపం ఇలా బయటపెడుతున్నారు కొందరు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఇది కేవలం కోపమే కాదు, భయం, కంగారు కూడా అని తెలుస్తోంది. కారణం స్పిరిట్ మూవీ ఆఫర్ ప్రభాస్ ఎప్పుడో ఇస్తే, ఇప్పుటికీ ఈ మూవీ తాలూకు కథా పనులు మొదలు పెట్టలేదు సందీప్ రెడ్డి. ఇంకా యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ కథనే రాస్తూ ఫిబ్రవరి నెలలో బిజీ అయ్యాడని తెలుస్తోంది.
KALKI 2898 AD: గ్రాఫిక్స్ విషయంలో కల్కిని మించేలా రాజా సాబ్?
యానిమల్ ఎంత పెద్దహిట్ అయినా ఇంకా ఆ మత్తులోనే జర్నీ చేస్తున్నాడు సందీప్ అనేది ప్రభాస్ ఫ్యాన్స్ కోపానికి కారణం. ఇలాగే త్రివిక్రమ్ చేసిన తప్పుకి మహేశ్ బాబుకి పనిష్మెంట్‌లా మారింది. పవర్ స్టార్‌తో త్రివిక్రమ్‌కి ఉన్న అనుబంధం వల్ల, పవన్ మూవీలైన భీమ్లానాయక్, బ్రో, సుజీత్ తీసే ఓజీ తాలూకు డీల్స్ దగ్గరుండి చూసుకున్నాడు మాటల మాంత్రికుడు. ఇలా టైం అంతా పవన్ సినిమాలను కో ఆర్డినేట్ చేయటానికే కేటాయించటం వల్ల, మహేశ్‌తో కమిటైన గుంటూరు కారం కథలో, మేకింగ్‌లో క్వాలిటీ పడిపోయిందన్నారు. దాని ఫలితమే గుంటూరు కారం రిజల్ట్ అనే కామెంట్లు పెంచారు.
ఇలానే స్పిరిట్ మూవీకి కమిటై, యానిమల్ పార్క్ కోసం పని చేస్తే ఇక ప్రభాస్ మూవీ కథలో క్వాలిటీ పరిస్థితేంటని కంగారు పడుతున్నారు రెబల్ ఫ్యాన్స్. సరే సందీప్ రెడ్డి యానిమల్ పార్క్ కథ రాసి, స్పిరిట్ కథలో క్వాలిటీ తగ్గకుండా ఉండేందుకు ఏడెనిమిది నెలలు కథ రాస్తానంటే, ఈ ఏడాది స్పిరిట్ పట్టాలెక్కడం గగనమౌతుంది. అలా చూసినా నష్టమే కదా అన్న కామెంట్లు పెరిగాయి.