వంగా యూనివర్స్… యానిమల్, స్పిరిట్, డ్రాగన్ తో బిగ్ ప్లాన్
సందీప్ రెడ్డి వంగా... ఇప్పుడు ఈ పేరు ఇండియన్ సినిమాను షేక్ చేయడానికి రెడీ అవుతోంది. అర్జున్ రెడ్డితో టాలీవుడ్ కు తాను ఏంటీ అనేది పక్కా లెక్కతో చూపించిన ఈ మెంటల్ మాస్ డైరెక్టర్... యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో షేక్ చేసేసాడు.
సందీప్ రెడ్డి వంగా… ఇప్పుడు ఈ పేరు ఇండియన్ సినిమాను షేక్ చేయడానికి రెడీ అవుతోంది. అర్జున్ రెడ్డితో టాలీవుడ్ కు తాను ఏంటీ అనేది పక్కా లెక్కతో చూపించిన ఈ మెంటల్ మాస్ డైరెక్టర్… యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో షేక్ చేసేసాడు. యానిమల్ సినిమాను ఎవరు ఏ రకంగా టార్గెట్ చేసినా… ఆడియన్స్ కు మాత్రం ఆ సినిమా యమాగా నచ్చేసింది. ఒక్కో సీన్ కు ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. వంగాలో ఎమోషన్స్, లవ్, వైలెన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో యానిమల్ ప్రూవ్ చేసింది.
ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉంటుందో అనే భయం జనాల్లో పీక్స్ లో ఉంది. స్టార్ హీరోలు అందరూ ఇప్పటి వరకు రాజమౌళి అనే డైరెక్టర్ పేరు జపిస్తే… ఇప్పుడు వంగా పేరు జపిస్తున్నారు. మనోడికి సినిమా ఛాన్స్ ఇస్తే చాలు దున్నేస్తాడు అనే నమ్మకం స్టార్ హీరోస్ లో పిచ్చ పిచ్చగా వచ్చింది. స్పిరిట్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్ కూడా స్టార్ట్ అయింది. త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. ప్రభాస్ లేకుండా రెండు మూడు నెలల పాటు షూటింగ్ కంప్లీట్ చేయనున్నాడు సందీప్ రెడ్డి వంగా.
యానిమల్ సినిమా, అర్జున్ రెడ్డి సినిమాలు చూస్తే… హీరో స్క్రీన్ టైం ఎక్కువగా ఉంటుంది. ఇతర నటుల డామినేషన్ చాలా తక్కువ. ఇప్పుడు స్పిరిట్ లో మాత్రం విలన్ కు కూడా మంచి వెయిట్ ఇవ్వాలని వంగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ టైం లోనే ఓ క్రీజీ ఆలోచన చేస్తున్నాడు వంగా. స్పిరిట్ కు యానిమల్ పార్క్ సీక్వెల్ కు లింక్ చేసి… దానిని డ్రాగన్ తో కలిపి… ఆ తర్వాత యానిమల్ పార్క్ సీక్వెల్ తో ఈ సీరీస్ ను ఫినిష్ చేయాలని భావిస్తున్నాడు. అంటే… ప్రభాస్, ఎన్టీఆర్, రణబీర్ ను ఒకే స్క్రీన్ పై చూపించడానికి రెడీ అవుతున్నాడు.
యానిమల్ సినిమా పార్ట్ 2 పై జనాల్లో క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను ఇంకా పెంచుతూ స్పిరిట్ ను డ్రాగన్ ను వాడుకోవాలని భావిస్తున్నాడు. ముగ్గురు హీరోలకు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసాడు వంగా. స్పిరిట్ షూట్ ఎండింగ్ లో యానిమల్ కు క్లూ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇదంతా వర్కౌట్ అయితే మాత్రం బాక్సాఫీస్ షేక్ కావడం కాదు… పేలిపోవడం ఖాయం అంటున్నారు ఆడియన్స్. మరి వంగా ప్లాన్ ఏంటో చూడాలి. స్పిరిట్ ను ఎలా అయినా 2026 లో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయాడు.