రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి మూవీ అంటేనే, బాక్సాఫీస్ బద్దలయ్యే సునామీ ఏదో వస్తుందనేంతగా అంచనాలుంటాయి. అసలు కోపిష్టి హీరో పాత్రలతో ట్రెండ్ సెట్ చేస్తున్న సందీప్ కి ప్రభాస్ దొరికితే, గన్నుకి గ్రానైడ్ దొరికినట్టే... ప్రతీ బుల్లెట్టు, మందు పాతరలా పేలాల్సిందే... ప్రభాస్ కటౌట్ అలాంటిది... కరెక్ట్ గా చెప్పాలంటే చత్రపతి, బాహుబలి లో తప్ప ఈ కటౌట్ కి తగ్గ పాత్ర పడలేదు.. అందుకే తనకి ఖాకీ చొక్కతొడిగి, లాటీనిస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ.. ఐతే ఈ దర్శకుడి పని తనం ఆల్రెడీ మొదలైనట్టుంది. రెబల్ స్టార్ ప్రభాస్ లుక్కులో కిక్కు మారింది. మొన్నీమధ్యే తెలంగాణ సీఎం ఆదేశాల మేరకు, డ్రగ్స్ కి ఎగైనెస్ట్ గా చేసిన వీడియోలో ప్రభాస్ లుక్కు కిక్ ఇచ్చింది.. విచిత్రం ఏంటంటే ఈ సారి రెబల్ స్టార్ స్పిరిట్ ని, యానిమల్ పార్క్ లోనే ప్లాన్ చేసినట్టున్నాడు దర్శకుడు. అంటే స్పిరిట్ లో రణ్ బీర్ కపూర్ ఎంట్రీనే కాదు, అర్జున్ రెడ్డి గా విజయ్ దేవరకొండ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. ఓరకంగా ఇది సందీప్ రెడ్డి సినిమాటిక్ యూనివర్స్ అనుకోవచ్చంటున్నారు. అలాంటి సర్ ప్రైజ్ ని సైలెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు సందీప్.. అదేంటో చూసేయండి... రెబల్ స్టార్ తో సందీప్ రెడ్డి తీయబోతున్న స్పిరిట్ మూవీ మార్చ్ లో మొదలవ్వబోతోంది. సంక్రాంతికే సెట్స్ పైకెళ్లాల్సిన ఈ ప్రాజెక్ట్, ది రాజా సాబ్ పెండింగ్ షూటింగ్ వల్లే మార్చ్ కి వాయిదా పడిందట. ఐతే 25 రోజుల షూటింగ్ తో ది రాజా సాబ్ పూర్తైతే, ఇక స్పిరిట్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ఉంది. కాకపోతే ఫౌజీని చేస్తూనే స్పిరిట్ ని ప్యార్ లల్ గా చేయబోతున్నాడు ప్రభాస్. విజయ్ ని అర్జున్ రెడ్డిగా మార్చి, షాహిద్ కపూర్ ని కబీర్ సింగ్ మార్చిన సందీప్ రెడ్డి వంగ, రణ్ బీర్ కపూర్ లోని యానిమల్ ని చూపించాడు. తనకి 900 కోట్ల వసూళ్ళని పరిచయం చేశాడు. అలాంటి తన మేకింగ్ లో రెబల్ స్టార్ పాత్ర ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ జనాల్లో ఉంది. దీనికి తోడు ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడంటే, భూమి బద్దలయ్యే సెన్సేషన్ ఈసినిమాతో క్రియేట్ అయ్యేలా ఉందంటున్నారు. అలాంటి మూవీకి యానిమల తోడైతే... సీన్ లోకి అర్జున్ రెడ్డితో కలిసి కబీర్ సింగ్ వస్తే... ఇలాంటి డిస్కర్షనే ఈమధ్య జరిగిందని తెలుస్తోంది. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక సినిమాకు, మరో మూవీతో లింక్ పెట్టినట్టు.... స్పిరిట్ కి అర్జున్ రెడ్డి, యానిమల్, కబీర్ సింగ్ కి ముడిపెట్టేలా ఉన్నాడట సందీప్ రెడ్డి. ఇదే జరిగితే పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే. ఐతే ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్పామ్ కాలేదు. కాని ఈ క్రేజీ ఐడియాని సందీప్ రెడ్డినే తన టీం తో పంచుకోవటంతో, నిజంగా ఇది జరిగే అవకాశాలున్నాయనేమాటే వినిపిస్తోంది స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ అయితే, ఒక సీన్ లో డాక్టర్స్ గా అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ హీరోకి హెల్ప్ చేయటం... యానిమల్ మాత్రం విలన్ గ్యాంగ్ కి సపోర్ట్ చేయటం లాంటి సీన్స్ తో సందీప్ రెడ్డి వంగ తన సినిమాటిక్ యూనివర్స్ ని ప్లాన్ చేసేలా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇది ఐడియా స్టేజ్ లోనే ఉంది కాని, సినిమాలో సాలిడ్ సీన్ గా మారుతుందో లేదో లాంచ్ రోజే తేలే ఛాన్స్ ఉంది. [embed]https://www.youtube.com/watch?v=SLMGYjQqMqY[/embed]