Prabhas: రేసులో ఆ ఇద్దరు.. ప్రభాస్ హీరోయిన్ వేటలో సందీప్ రెడ్డి

ప్రభాస్ కటౌట్‌ని ఇప్పటి వరకు ఎవరు ప్రజెంట్ చేయని విధంగా చూపించడానికి రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు రెబల్ స్టార్. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు సందీప్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 30, 2024 | 03:29 PMLast Updated on: Apr 30, 2024 | 3:29 PM

Sandeep Reddy Vanga Selecting Heroines For Prabhas Spirit Movie

Prabhas: ప్రభాస్ కటౌట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఆ హైట్, పర్సనాలిటీ మామూలుగా ఉండదు. బాహుబలి తర్వాత ప్రభాస్ కటౌట్‌ని సలార్ సినిమాలో పర్ఫెక్ట్‌గా వాడుకున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో ప్రభాస్ కటౌట్‌కి నీల్ ఇచ్చిన ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పించింది. నెక్స్ట్ సలార్ 2లో అంతకుమించిన ఎలివేషన్ ఉండబోతోంది.

Jr NTR: నెక్స్ట్ వార్ ఇక్కడే.. ఈసారి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘యుద్ధం’ ఇక్కడే

అలాగే.. ప్రభాస్ కటౌట్‌ని ఇప్పటి వరకు ఎవరు ప్రజెంట్ చేయని విధంగా చూపించడానికి రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు రెబల్ స్టార్. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు సందీప్. డార్లింగ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా.. స్క్రిప్ట్ మలుస్తున్నాడని టాక్. ఈ ఏడాది ఎండింగ్‌లో స్పిరిట్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో.. స్పిరిట్ హీరోయిన్ ఎవరు? అనే చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ నటిస్తున్నట్టుగా వార్తలు వస్తునే ఉన్నాయి. గతంలో రష్మిక మందన్న, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపించగా.. తాజాగా కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది.

ఇప్పటికే సందీప్.. ఆమెను సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే.. మరో హీరోయిన్ పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను అనుకుంటున్నాడట. అయితే.. వీళ్లు ఫైనల్ అని ఇప్పుడే చెప్పలేం. త్వరలోనే స్పిరిట్ హీరోయిన్స్ విషయంలో క్లారిటీ రానుంది. ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఫస్ట్ డేనే 150 కోట్ల ఓపెనింగ్స్ కొడతామని చెబుతున్నాడు సందీప్. మరి స్పిరిట్ ఎలా ఉంటుందో చూడాలి.