కోసి కారం పెట్టాడు.. తట్టుకోలేక పోతున్న బాలీవుడ్..

సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డితో ఇక్కడ మంట పెట్టాడు. దాన్నే హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ ని ఏకిపారేశాడు. తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుని యానిమల్ తో హిందీ దర్శక రచయితలకి పంచ్ ఇచ్చాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 27, 2025 | 06:20 PMLast Updated on: Feb 27, 2025 | 6:20 PM

Sandeep Reddy Vanga Senstional Comments On Bollywood Industry

సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డితో ఇక్కడ మంట పెట్టాడు. దాన్నే హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ ని ఏకిపారేశాడు. తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుని యానిమల్ తో హిందీ దర్శక రచయితలకి పంచ్ ఇచ్చాడు. అక్కడి రివ్యూరైటర్లు, సౌత్ సినిమాలంటేనే కుల్లుకునేవాళ్లని ఓ ఆట ఆడుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ బ్యాటింగ్ కి టైం దొరికిందేమో, ఒక్కొక్కరికి కూంగ్ ఫూ పంచ్ ఇచ్చాడు. ఇంటర్వూలో తను పేల్చిన ఒక్కో మాట తూటాలా, బీటౌన్ పెద్దోళ్లని గాయపరిచినట్టుంది. తేలు కుట్టిన దొంగాల్లా నోరు మూసుకున్నారనే కామెంట్ల దాడి పెరిగింది. ఇదంతా చూసి ఇప్పుడు రణ్ బీర్ కపూర్ కంగారుపడుతున్నాడు. ఆలియాకి టెన్షన్ పెరిగిపోయింది. సందీప్ అన్న ఒక్క మాటతో బాలీవుడ్ లో పెద్ద తుఫానే మొదలైంది. పైసలకోసం కక్కుర్తి పడే వాల్లకెందుకు నీతులంటూ విరుచుకుపడ్డాడు సందీప్ రెడ్డి. అది కూడా చాలా పొలైట్ గా… ఇంతకి తనెందుకు ఫైర్ అయ్యాడు… తన మాటలకెందుకు బాలీవుడ్ నోరుమూసుకుంది..? రణ్ బీర్ కపూర్ ఎందుకు టెన్షన్ పడుతున్నాడు..? హావేలుక్

గతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి సింగర్ బాలీవుడ్ వెలితే, తనని ఎదక్కుండా, ఆఫర్లు రాకుండా తొక్కేశారు. సౌత్ నుంచి హీరోయిన్లనే సరిగా అలో చేయరు, హీరోలు వెళితే ఊరుకుంటారా? రజినీకాంత్ లాంటి వాడిని కూడా బాలీవుడ్ లో ఎక్కడ పాతుకుపోతాడో అని తొక్కే ప్రయత్నం చేశారు. అలాంటి బ్యాచ్ కి మొగుడులా తయారయ్యాడు తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. కొత్తగా తనో ఇంటర్వూలో బాలీవుడ్ మొత్తాన్ని ఏకి పారేశాడు.ప్రభాస్ తో స్పిట్ మూవీ తీయబోతున్న సందీప్ రెడ్డి వంగ, తన ఇంటర్వూలో బాంబు పేల్చాడు. కేవలం తన సినిమా యానిమల్ లోనటించాడని ఓ నటుడిని, ఓ బాలీవుడ్ బ్యానర్ తీసుకోలేదన్నాడు. బాలీవుడ్ లో తనని బయటి వాడిలా చూస్తారనుకోనన్నాడు. కాకపోతే అక్కడ ముఠాలా తయారైన బ్యాచ్ తో పాటు ఇన్ ఈక్వాలిటీ ఉందని తేల్చాడు.

విచిత్రం ఏంటంటే యానిమల్ మూవీ మీద విమర్శించ వాల్లెవరుఅందులో హీరోని మాత్రం విమర్శించే ధైర్యం చేయలేదన్నాడు. కారణం తనతో వాళ్లు సినిమా తీయాల్సిన అవసరం ఉంది కాబట్టి, హీరోని తిట్టకుండా, కేవలం యానమిల్ దర్శకుడినే టార్గెట్ చేశాడన్నాడు సందీప్ ..ఈ ఒక్కమాట బాలీవుడ్ మాఫియాకి ఎక్కడో కాలేలా చేస్తోంది.ఇదేతో యాద్రుచ్చికంగా అన్న మాట కూడా కాదా. ఆల్రెడీ కంగనా రనౌత్ ఎన్నోసార్లు బాలీవుడ్ లో హీరోలని, హీరోయిన్లని ఎలా తొక్కుతారో, ఎలా మానిప్యూలేట్ చేస్తారో తేల్చింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా ఈ మాఫియా బాద భరించలేకే సూసైడ్ చేసుకున్నాడన్నారు. ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీంటిని సందీప్ రెడ్డి వంగ వచ్చి కెలికేశాడంటున్నారు. ఇదే రణ్ బీర్ మెడకు చుట్టుకునేలా ఉంది. ఎందుకంటే రణ్ బీర్ తో సందీప్ రెడ్డి వంగ యానిమల్ సీక్వెల్ తీసేదుంది… కాబట్టి ఇప్పుడు కాకపోయినా స్పిరిట్ రిలీజ్ టైంలోనో, యానిమల్ పార్క్ రిలీజ్ టైంలోనే ఈ మ్యాటర్ డిస్కర్షన్ కొస్తుంది. సో అప్పుడు రణ్ బీర్ కపూర్ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. లేదంటే యానిమల్ పార్క్ ప్రాజెక్టునే వదులుకోవాల్సి వస్తుంది. కాని తన కెరీర్ లో ఫస్ట్ మాస్ హిట్ ఇచ్చిన సందీప్ ని కాదని ముందుకెళ్లే ధైర్య రణ్ బీర్ కి ఉందనలేం…

అసలు బాలీవుడ్ లో ఏ విషయం గురించి మాట్లాడ్డానికి భయపడతారో, అదే అంశాన్ని డైరెక్ట్ గా ఎటాక్ చేస్తున్నాడు సందీప్.. మొన్నటి వరకు అక్కడి లిరిసిస్ట్ జావేద్ అక్తర్ మీద సింగిల్ కామెంట్ చేయటానికి అంతా జంకే వాళ్లు.. కాని సందీప్ రెడ్డి వంగ వచ్చి నీతులు చెప్పేముందు బూతుల సినిమాలు తీసే నీకొడుకుని సరిదిద్దుకో అన్నాడు. ఆ మాటకే బాలీవుడ్ ఉలిక్కి పడింది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో బడా బ్యానర్ చేసే అరాచకాలని ఇండైరెక్ట్ గా తేల్చాడు. మాటల తూటా పేల్చాడు… ఇన్నేళ్ల బాలీవుడ్ హిస్టరీలో దావూద్ ఇబ్రహీం పేరెత్తడానికి బాలీవుడ్ జనం భయపడితే, రామ్ గోపాల్ వర్మ ఆ కంటెంట్ తోనే డైరెక్ట్ గా సినిమాలు తీసి ఎటాక్ చేశాడు… ఇక మరో తెలుగోడు సందీప్ రెడ్డి వంగ వచ్చి బాలీవుడ్ లో ఏది మాట్లాడటానికి వణికి పోతారో, ఆ అంశాల మీదే మాటల తూటాలు పేల్చాడు..