PRABHAS: రెబల్ స్టార్ కొంపముంచేలా ఉన్న సందీప్ రెడ్డి వంగ

రీసెంట్‌గా తిరుపతిలో వెంకన్నను దర్శించుకున్న సందీప్.. జూన్‌లో స్పిరిట్ షూటింగ్ షురూ చేస్తాడన్నట్టు ప్రచారం జరిగింది. కాని అక్టోబర్‌లో కూడా ఈ మూవీ షూటింగ్ డౌటే. ఎందుకంటే స్పిరిట్ స్క్రిప్ట్ పూర్తవటానికి కనీసం ఆరునెలల టైం కావాలంటున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 23, 2024 | 04:04 PMLast Updated on: Mar 23, 2024 | 4:04 PM

Sandeep Reddy Vanga Taking More Time To Complete Prabhas Spirit Script

PRABHAS: అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ హిట్లతో హ్యాట్రిక్ కిక్‌లో ఉన్న సందీప్ రెడ్డి వంగ, రెబల్ స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేశాడు. అక్టోబర్‌లో షూటింగ్ అన్నారు. తీరా చూస్తే ఆరునెలల వ్రతం అంటూ సందీప్ రెడ్డి వంగ బాంబు పేల్చాడు. రీసెంట్‌గా తిరుపతిలో వెంకన్నను దర్శించుకున్న సందీప్.. జూన్‌లో స్పిరిట్ షూటింగ్ షురూ చేస్తాడన్నట్టు ప్రచారం జరిగింది. కాని అక్టోబర్‌లో కూడా ఈ మూవీ షూటింగ్ డౌటే.

SS RAJAMOULI: నెక్ట్స్ ఏంటి..? రాజమౌళిలానే భయపడుతున్నారు

ఎందుకంటే స్పిరిట్ స్క్రిప్ట్ పూర్తవటానికి కనీసం ఆరునెలల టైం కావాలంటున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆల్రెడీ ఏప్రిల్ దగ్గరకొస్తోంది, ఆరునెలలంటే అక్టోబర్ వరకు స్క్రిప్ట్ వర్కే జరిగే ఛాన్స్ ఉంది. ఆతర్వాత స్టార్ కాస్ట్, లొకేషన్లు, టెక్నీషియన్లు, అంటూ ప్రిప్రొడక్షన్ పనులకు మరో మూడు నెలలు పడుతుంది. అంటే 2024లో అసలు స్పిరిట్ షూటింగ్ మొదలయ్యే చాన్సే లేదా..? 2025 జనవరి లేదా ఫిబ్రవరిలోనే స్పిరిట్ మొదలయ్యేలా ఉంది.

ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావటానికి కారణం, యానిమల్ సీక్వెల్ అంటున్నారు. యానిమల్ పార్క్ స్క్రిప్ట్ ముందుగా పూర్తి చేసి, ఆ తర్వాత స్పిరిట్ వర్క్ మొదలు పెడతాడట. ఇలా రెబల్ స్టార్‌తో సందీప్ రెడ్డి సినిమా వచ్చే ఏడాదికి ముహుర్తం చూసుకోవాల్సి వస్తోంది.