Sania: సానియా విడాకులు.. క్లారిటీ వచ్చేసిందిగా!?
సెలబ్రిటీలు ఏం చేసినా వైరల్ అవుతుంది. అలాంటిది వివాహా బంధానికి బ్రేక్ చెప్తే.. ఎప్పుడూ హాట్‌టాపిక్కే ఇది! కారణాలు ఏవైనా.. సెలబ్రిటీలు ఈ మధ్య వరుస పెట్టి విడాకులు తీసుసకుంటున్నారు.
సమంత, నిహారిక ఇష్యూ గురించి చర్చ జరుగుతుండగానే.. ఇప్పుడు టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా పేరు కూడా ఈ విడాకుల లిస్టులో వినిపిస్తోంది. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్, సానియా విడాకుల ఆంశంమరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరూ త్వరలోనే వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయ్. షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో మార్పు చేయడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. ఇంతకుముందు షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో.. సూపర్ ఉమెన్ సానియా మీర్జా అని ఉండేది. అయితే ఇప్పుడు ఆ వాక్యాన్ని బయో నుంచి తొలగించి.. తన పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను చేర్చాడు.
బయోలో ఇతర వివరాలతో పాటు ఓ బిడ్డకు తండ్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉందంట మాలిక్ రాసుకొచ్చాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మాలిక్, సానియా విడాకులు తీసుకోవడం ఖాయమని నెటిజన్లు ఒకటే గుసగుస. ఇద్దరి విడాకుల గురించి ఇలాంటి ప్రచారం జరగడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని నెలల కింద కూడా సానియా, షోయబ్ మధ్య విభేదాలు తలెత్తాయనీ, వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్లు తెగ షికారు చేశాయ్. పాకిస్తానీ నటి అయేషా ఉమర్‌తో మాలిక్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తలను అయేషా కొట్టిపారేసింది. అయితే ఇదే సమయంలో సానియా, షోయబ్ కొత్త టాక్ షో ది మీర్జా మాలిక్ షో రావడంతో వారి విడాకుల ఊహాగానాలకు తెరపడింది. అయితే మాలిక్ ఇప్పుడు చేసిన పనితో.. మళ్లీ వారి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.