Pushpa 2: సుక్కూ స్కెచ్.. ఇంటర్నేషనల్ డాన్‌గా అధీర

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ముందు చెప్పినట్లుగానే ఆగస్టు 15న ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సుక్కు సైతం బన్నీని ఈసారి మాములుగా చూపించట్లేదని ఇన్‌సైడ్ టాక్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2024 | 03:41 PMLast Updated on: Mar 06, 2024 | 3:41 PM

Sanjay Dutt Playing International Don In Allu Arjuns Pushpa 2 Movie

Pushpa 2: రెండు నేషనల్ అవార్డులు రావడంతో పుష్ప సీక్వెల్‌పై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. దానికితోడు సినిమాకు సంబంధించిన పలు లీకులు బన్నీ ఫ్యాన్స్‌నే కాదు.. యావత్ సినీ లవర్స్‌లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. ఆ మధ్య రిలీజైన గ్లింప్స్ టాలీవుడ్‌తో పాటు అన్ని వుడ్‌లలోనూ సంచలనం సృష్టించింది. అంతేకాకుండా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. ఫస్ట్ లుక్ చాలా స్టైలిష్‌గా, గ్రాండియర్‌గా ఉండాలనుకుంటున్నారు. కానీ బన్నీ మాత్రం అమ్మవారి గెటప్‌లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అందరినీ షాక్‌కు గురి చేశాడు.

Varalaxmi Sarathkumar: జయమ్మ ట్విస్ట్.. వరలక్ష్మీ శరత్ కుమార్‌‌‌కు కాబోయే భర్తకు ముందే పెళ్లైందా..!

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ముందు చెప్పినట్లుగానే ఆగస్టు 15న ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సుక్కు సైతం బన్నీని ఈసారి మాములుగా చూపించట్లేదని ఇన్‌సైడ్ టాక్. ఈసారి బన్నీ వెయ్యి కోట్లు కొల్లగొట్టడం పక్కా అని అభిమానులు ధీమాగా ఉన్నారు. మరోవైపు సుకుమార్ కేవలం ఇంటర్వెల్ సీన్‌కే రూ.50 కోట్లు ఖర్చు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఒక్క ఫైట్ సీన్ కోసమే అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారంటే మాములు విషయం కాదు. ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ టాక్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఇంటర్నెషనల్ డాన్‌గా కనిపించనున్నాడట. ఇప్పటికే మేకర్స్ ఆయన్ను సంప్రదించగా.. సంజయ్ దత్ స్టోరీ విని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ఇక సెకండ్ పార్టులో పుష్ప ఇంటర్నేషనల్ లెవల్లో డీలింగ్స్ చేస్తాడని ముందు నుంచి లీకైన వార్తలే. అలా బన్నీ వ్యాపారంలోకి సంజయ్ దత్ వచ్చి వేలు పెడతాడట. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య పోరు చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందని టాలీవుడ్‌లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీక్వెల్ కున్న క్రేజ్ చూస్తుంటే సినిమాకు కొంచెం పాజిటీవ్ టాక్ వచ్చిన ఊహకందని రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టడడం ఖాయం అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.