ప్రభాస్ సైలెంట్ గా గోకుతున్న బాలీవుడ్ బడా డైరెక్టర్…??

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. ప్రభాస్ సినిమాలకు నేషనల్ పర్మిట్ ఉండటంతో... కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా బ్రేక్ పడటం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 11, 2025 | 08:41 PMLast Updated on: Jan 11, 2025 | 8:41 PM

Sanjay Leela Bansali Tried Movie With Prabhas

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. ప్రభాస్ సినిమాలకు నేషనల్ పర్మిట్ ఉండటంతో… కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా బ్రేక్ పడటం లేదు. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఇండియా వైడ్ గా ఉండే క్రేజ్ ఒక రేంజ్ లో ఉంటుంది. సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ పెరిగిపోతుంది. దీనితో బాలీవుడ్ జనాలు కూడా అతని సినిమాలు వస్తుంది కంగారుపడుతున్నారు. ఇక స్టార్ డైరెక్టర్లు అందరూ ప్రభాస్ తో ప్రాజెక్టు చేయడానికి రెడీ అయిపోతున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్లు, కన్నడ స్టార్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు ప్రభాస్ వెంట పడుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ తెలుగులో యావరేజ్ డైరెక్టర్లతో సూపర్ హిట్లు కొట్టడానికి రెడీ అయిపోతున్నాడు. ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ కూడా ఎక్కువగా యావరేజ్ డైరెక్టర్లతోనే ఉంటున్నాయి. బాహుబలి సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ తో పెద్దగా సినిమాలు చేసే ప్రయత్నం చేయలేదు. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమా చేసినా.. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న డైరెక్టర్ లందరూ ప్రభాస్ రేంజ్ కంటే తక్కువే. అయితే ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ మాత్రం ప్రభాస్ ను ఎలాగైనా సరే ఒప్పించాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

అతనే సంజయ్ లీలా బన్సాలి. ఎప్పటినుంచో తెలుగులో ఒక సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్న బన్సాలి.. ప్రభాస్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ప్రభాస్ తో సినిమా చేస్తే సినిమా హిట్ అయినా కాకపోయినా లాస్ ఉండదు అనే కాన్ఫిడెన్స్ లో నిర్మాతలు కూడా ఉండటం చూసి అతని కాస్త కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. బన్సాలి సినిమా అంటే కచ్చితంగా మంచి హిట్ అవుతుంది అనే ధీమా ఆడియన్స్ లో ఉంటుంది. సినిమా ఎలా ఉన్నా సరే కచ్చితంగా క్లాసిక్ అనే ఫీల్ ఉంటుంది. అందుకే బన్సాలి ఇప్పుడు కాస్త బాలీవుడ్ హీరోలను పక్కనపెట్టి తెలుగు వాళ్ళ వైపు దృష్టి పెడుతున్నాడు.

తెలుగులో ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలంటే కచ్చితంగా బన్సాలి.. ప్రభాస్ తో చేయాల్సిందే అనే నిర్ణయానికి వచ్చేసాడు. అల్లు అర్జున్ ప్రయత్నాలు చేస్తున్న సరే ప్రభాస్ వైఫై అతని దృష్టి ఉందని… హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ సినిమా రానున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో ప్రభాస్ మూడు సినిమాలు చేస్తాడు. అందులో ఒక సినిమా ప్రశాంత్ నీల్ తో ఉంటే మరో సినిమా లోకేష్ కనకరాజ్ తో ఉండనుంది. ఇక మూడో సినిమా ఎవరితో అనే క్లారిటీ లేదు. ప్రశాంత్ వర్మ పేరు కూడా వినిపించింది. కానీ ఆ ప్రాజెక్టు దాదాపుగా బన్సాలి తోనే అనే టాకు వస్తుంది. అల్లు అర్జున్ సినిమా విషయంలో బన్సాలి అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదని టాక్. అయితే ఆదిపురుష్ సినిమా తర్వాత ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ల విషయంలో అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు.