Sanjay Leela Bhansali: చరణ్.. తారక్.. ఇద్దరిలో ఈ దర్శకుడి సినిమా ఎవరితో..?
చరణ్‌కి ఆమధ్య బాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి నుంచి కబురొచ్చింది. కథా చర్చలు జరిగాయని ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు. ఇంతలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ను కూడా సంజయ్ లీలా భన్సాలి మొన్న గోవాలో కలిశాడని తెలుస్తోంది.

Sanjay Leela Bhansali: రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా మారకముందు హిందీలో జంజీర్ రీమేక్ చేశాడు. అప్పుడు కామెంట్ చేసిన హిందీ జనమే త్రిబుల్ ఆర్‌లో రామ్ పాత్రకు జై శ్రీరామ్ అన్నారు. అంతగా ఫోకస్ అయిన చరణ్‌కి ఆమధ్య బాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి నుంచి కబురొచ్చింది. కథా చర్చలు జరిగాయని ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు.
MAHESH BABU: ఇద్దర దర్శకులకు మహేశ్ గ్రీన్ సిగ్నల్.. రాజమౌళి సినిమా తర్వాత వీళ్లతోనే..!
ఇంతలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ను కూడా సంజయ్ లీలా భన్సాలి మొన్న గోవాలో కలిశాడని తెలుస్తోంది. అక్కడ జరిగింది కూడా కథా చర్చలే అంటున్నారు. బాలీవుడ్‌కి రాజమౌళి లాంటి డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి. అలాంటి తనతో మూవీ అంటే ఎవరి ఫేట్ అయినా మారుతుంది. అందుకే చెర్రీ, తారక్ భన్సాలి కబురు కోసం వేయిట్ చేస్తున్నారు. వార్ 2తో తొలి హిందీ మూవీ చేయబోతున్న తారక్, ఆ తర్వాత భన్సాలి మూవీ చేస్తే అక్కడ ఇమేజ్ ఓరేంజ్‌లో పెరిగిపోతుంది.
అందుకే తను కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా వేయిట్ చేస్తుంటే.. సడన్‌గా అలియా, రణ్‌వీర్, హృతిక్‌తో ట్రైలింగువల్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశాడు భన్సాలి. అదయ్యాకే చెర్రీతో లేదా తారక్‌తో భన్సాలి మూవీ ఉండొచ్చని తెలుస్తోంది.