SANKRANTHI MOVIES: సంక్రాంతి సినిమాలు.. అన్నీ బాగున్నాయేంటి..?

గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్ వచ్చినప్పుడు ట్రోలింగ్స్ ఎంత జరిగినా, మహేశ్ డాన్స్‌తో వైబ్స్ మారాయి. ఇక ట్రైలర్ వస్తే ఇదేలా అంచనాలు పెంచుతుందో చెప్పలేం. విచిత్రం ఏంటంటే హనుమాన్ మూవీ తాలూకు కొత్త పాట గ్రాఫిక్స్ ప్రోమో కూడా మతిపోగొడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 3, 2024 | 07:32 PMLast Updated on: Jan 03, 2024 | 7:32 PM

Sankranthi Movies Getting Possitive Response From Audience

SANKRANTHI MOVIES: సైంధవ్ మూవీ ట్రైలర్ వచ్చాక ఈ సినిమా మీద హైప్ ఓరేంజ్‌లో పెరిగింది. హిట్ 1, హిట్ 2 అంటూ యాక్షన్ థ్రిల్లర్స్‌తో మతిపోగొట్టిన శైలేష్ కొలను.. సైంధవ్ మూవీని అంతకుమించేలా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. విక్టరీ స్టార్ 75వ మూవీ అంటే ఆరేంజ్‌లోనే ఉందంటున్నారు. అసలు సంక్రాంతి పోరులో ఈ సినిమా తట్టుకోగలదా అనేంతగా టీజర్ వచ్చినప్పుడు కామెంట్లు వచ్చాయి.

MAHESH BABU: బార్బారికుడిగా మారుతున్న సూపర్ స్టార్.. మహేశ్-రాజమౌళి సినిమా టైటిల్ ఇదే..

ట్రైలర్ వచ్చాక సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. యూట్యూబ్ ఊగిపోతోంది. ఒకప్పటి గణేష్ మళ్లీ వచ్చాడా అనేంతగా వైబ్రేషన్సే మారాయి. గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్ వచ్చినప్పుడు ట్రోలింగ్స్ ఎంత జరిగినా, మహేశ్ డాన్స్‌తో వైబ్స్ మారాయి. ఇక ట్రైలర్ వస్తే ఇదేలా అంచనాలు పెంచుతుందో చెప్పలేం. విచిత్రం ఏంటంటే హనుమాన్ మూవీ తాలూకు కొత్త పాట గ్రాఫిక్స్ ప్రోమో కూడా మతిపోగొడుతోంది. బాహుబలి 2 బిగినింగ్‌లో వచ్చే పాట తాలూకు గ్రాఫిక్సే దీనికి వాడారా అనేలా పాట ఉండటంతో, ఆన్‌లైన్‌లో తూటాలా దూసుకెళుతోంది.

ఎలా చూసినా కొత్త పాటలు, ప్రోమోలు అంచనాలను తారుమారు చేయటమే కాదు, పెంచేస్తున్నాయి. ఇక ఈగిల్ ట్రైలర్ కూడా బాగానే మెప్పిస్తోంది. నా సామిరంగ కంటెంట్ కూడా ఆకట్టుకునేలానే ఉంది. మరి.. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల‌ని ఏ సినిమా ఎలా మెప్పిస్తుందో చూడాలి.