టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ సినిమాలు అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ కు పండుగే. సినిమా ఎలా ఉన్నా సరే ఫ్యామిలీ ఆడియన్స్ కు కావాల్సిన వినోదం ఆయన సినిమాల్లో పక్కాగా దొరుకుతుంది. కామెడి డైరెక్టర్లతో ఆయన సినిమా చేస్తే పొట్ట చేత్తో పట్టుకుని నవ్వడమే. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో పొంగల్ కు ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చారు వెంకటేష్. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో వెంకటేష్ చాలా జాగ్రత్తగా ప్రమోషన్స్ చేసారు. ఎప్పుడూ లేనంతగా ఆయన ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. మరి సినిమా ఎలా ఉంది...? కథను ముందే రివీల్ చేసి.. ఆడియన్స్ ను ఎలా సాటిస్ఫై చేసారు...? అప్పట్లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాతో ఇద్దరు హీరోయిన్లతో ఆడియన్స్ ను ఊపేసిన వెంకటేష్.. మరి ఈ సినిమాతో ఎలా వినోదం పంచారు...? ఒక్కసారి చూద్దాం. కథ యాదగిరి దామోదర రాజు అలియాస్ యమ ధర్మరాజు పాత్రలో వెంకటేష్ నటించారు. భాగ్యలక్ష్మి పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించారు. వీరిది చాలా హుషారుగా గడిచిపోయే ఫ్యామిలీ. గోదారిగట్టుపైనా రామచిలకవే అంటూ తన భాగ్యాన్ని ఓ రేంజ్ లో ప్రేమిస్తూ ఉంటాడు రాజు. ఓ హ్యపీ మూమెంట్‌లో తన ఫస్ట్ లవ్ స్టోరీని భార్య భాగ్యంతో షేర్ చేసుకుంటాడు. తాను పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న టైంలో ట్రైనీగా వచ్చిన మీనా అనే అమ్మాయి.. (మీనాక్షిచౌదరి)తో ఉన్న లవ్ స్టోరీని భాగ్యంతో చెప్పుకుంటాడు. ఓ కేసులో రాజుని సస్పెండ్ చేస్తారు. హైప్రొఫైల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి సత్య ఆకేళ్లను కిడ్నాప్ చేస్తే.. ఆ కేసుని టేకప్ చేస్తాడు. సీఎం కేశవ్ ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుంటారు. పోలీసులకు సవాల్‌గా మారిన ఈ క్రైమ్ అండ్ కిడ్నాప్ కేసుని రాజు మాత్రమే సాల్వ్ చేస్తాడని నమ్మి.. అతని సస్పెన్షన్‌ను ఎత్తేసి.. క్రిమినల్స్ ను పట్టుకునే బాధ్యత ఇస్తాడు. ఇక ఇదే కేసులో హెల్ప్ చేయడానికి జూనియర్ పోలీస్ ఆఫీసర్ మీనాని పంపాడు. అక్కడి నుంచి స్టోరీలో ఇంట్రస్టింగ్ సీన్స్ మొదలవుతాయి. టిపికల్ ట్రాజరీ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ఇది. పోలీస్ ఆఫీసర్‌గా వచ్చిన మినానే... తన భర్త మాజీ ప్రేయసి కావడంతో భాగ్యం బాగా నిఘాపెడుతుంది. కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో రాజు, మీనాలు దగ్గరౌతుండటాన్ని చూసి భాగ్యం అసలు తట్టుకోలేకపోతుంది. తాను కూడా ఇన్వెస్టిగేషన్‌లో ఎంటర్ అవుతుంది. వాళ్ళు క్రిమినల్స్ ను పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే భాగ్యం తన భర్తను పట్టుకోవడానికి ట్రై చేయడం బాగుంటుంది. భర్త బ్రేకప్ లవ్ స్టోరీ మళ్ళీ అటాచ్ అవ్వకుండా తన ప్రయత్నం చేస్తుంది. అటు భార్య.. ఇటు మాజీ ప్రేయసి మధ్య నలిగిపోయే ధర్మ రాజు.. కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్‌ను ఎలా సాల్వ్ చేసాడు అనేది కథ. ఒకవైపు భార్యకు మరో వైపు... మాజీ ప్రేయసికి మధ్య ధర్మ రాజు నలిగిపోతూ ఉంటాడు. నటన స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ పెట్టిన ఫోకస్ కు... నటులు అందరూ న్యాయం చేస్తారు. కామెడి టైమింగ్ తో వెంకటేష్ దుమ్ము రేపుతాడు. ఇతర నటీ నటులు కూడా తమ రేంజ్ కు తగ్గట్టు నటిస్తారు. ఐశ్వర్య రాజేష్ తన పాత్రకు న్యాయం చేస్తుంది. గ్లామర్ పాత్రలో మీనాక్షి చౌదరి కూడా చాలా బాగా నటిస్తుంది. లక్కీ భాస్కర్ తర్వాత ఆమె నటనలో స్కిల్స్ పెంచుకుంది. ఈ సినిమాలో అది పక్కాగా కనపడుతుంది. సినిమాలో కీ రోల్ ప్లే చేసింది కామెడి సీన్స్. ఓవరాల్ గా సినిమాకు కామెడినే బలం. ఫ్యామిలీ ఆడియన్స్ కు సంక్రాంతికి.. నిజమైన వినోదం అంటే ఈ సినిమాతోనే. మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఇష్టపడే విధంగానే డైరెక్టర్ అనీల్ రావిపూడి ప్లాన్ చేసాడు. రొటీన్ కథ అనే టాక్ ఉంది. కథ కొత్తగా ఏమీ లేదు. ఇలాంటి కథలు చాలా సినిమాల్లో చూసాము గాని.. కామెడితోనే నడిపించారు. ఇక సినిమా ప్లే టైం కూడా ఎక్కువ అనే కామెంట్స్ వచ్చాయి. కాని కామెడి ఉండటంతో ఎంజాయ్ చేసారు. [embed]https://www.youtube.com/watch?v=C5BL-atYiLE[/embed]