Sankranti : సంక్రాంతి ఎఫెక్ట్.. హను మాన్ ముందుకు రానుందా.. ?

తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి కూడా సంక్రాంతి పండగ అంటే సినిమా అనే నానుడి అనాదిగా వస్తు ఉంది. అలాగే సంక్రాంతికి వచ్చే సినిమాల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలు ఉండవు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 23, 2023 | 05:55 PMLast Updated on: Dec 23, 2023 | 5:55 PM

Sankranti Effect Will Hanuman Come Forward

 

తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి కూడా సంక్రాంతి పండగ అంటే సినిమా అనే నానుడి అనాదిగా వస్తు ఉంది. అలాగే సంక్రాంతికి వచ్చే సినిమాల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలు ఉండవు. సినిమా బాగుంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మ రధం పడతారు. ఇప్పుడు ఈ సంక్రాంతికి కూడా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటిల్లో ఒకటి హనుమాన్. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.

తేజ సజ్జ హీరోగా వెరైటీ చిత్రాల సృష్టికర్త ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో వస్తున్న సినిమా హనుమాన్. పాన్ ఇండియా లెవల్లో విడుదల అవుతున్న ఈ మూవీ మీద మూవీ లవర్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ తో అంచనాలు పీక్ కి వెళ్లాయి. ఇప్పుడు ఈ సినిమా ఒక రోజు ముందుగా థియేటర్స్ లో కి అడుగుపెట్టనుందనే రూమర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

వాస్తవానికి మహేష్ సినిమా గుంటూరు కారం రిలీజ్ రోజే అంటే జనవరి 12 నే హానుమాన్ కూడా రిలీజ్ అని చాలా రోజుల కిందటే మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు జనవరి 11 న హనుమాన్ ని రిలీజ్ చెయ్యాలని బావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. జాంబి రెడ్డి ని నిర్మించిన నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అమ్రితా అయ్యర్ తేజ తో జోడి కట్టనుండగా వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది.