SANKRANTHI MOVIES: సంక్రాంతి కి థియేటర్ల పంచాయతీ.. ఎవ్వరూ తగ్గట్లేదు..
సంక్రాంతి బరిలో ముందుగా ఏడెనిమిది సినిమాలు దిగాలనుకున్నా.. చివరికి 5 సినిమాలు మిగిలాయి. అయితే ఎవరూ రిలీజ్ డేట్ మార్చుకోము అంటున్నారు.
SANKRANTHI MOVIES: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతి పంచాయితీ నడుస్తోంది. సంక్రాంతి బరిలో 5 సినిమాలొస్తున్నాయి. పండక్కి వచ్చే సినిమాల నిర్మాతలు సమావేశమై.. రిలీజ్ డేట్‌లో మార్పులు.. థియేటర్స్ సర్దుబాటు చర్చకు వచ్చాయి. అయితే ఎవరూ తగ్గేదే లేదంటూ రిలీజ్ డేట్ మార్చుకోము అంటున్నారు. సంక్రాంతి బరిలో ముందుగా ఏడెనిమిది సినిమాలు దిగాలనుకున్నా.. చివరికి 5 సినిమాలు మిగిలాయి. విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ షూటింగ్ పూర్తికాకపోవడంతో రేసు నుంచి తప్పుకుంది.
SALAAR: ప్రభాస్ ఫ్యాన్స్‌ను అడ్డుకున్న థియేటర్ యాజమాన్యం.. గుంటూరులో ఫ్యాన్స్ రచ్చ..
అలాగే.. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’తో పోటీపడటం ఇష్టంలేక రజనీకాంత్ తప్పుకున్నాడు. రజనీ గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్న ‘లాల్ సలాం’ జనవరి 26న రిలీజ్ కానుంది. ఫైనల్‌గా ఐదు తెలుగు సినిమాలు మిగిలాయి. 12న గుంటూరు కారం, ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ రిలీజ్ అవుతున్నాయి. ఆ మరుసరి రోజే 13న రవితేజ ‘ఈగిల్’.. వెంకటేశ్ సైంధవ్ పోటీపడుతున్నాయి. ఇక 14న నాగార్జున ‘నా సామి రంగ’ రానుంది. సంక్రాంతికి ఐదు సినిమాలొస్తున్నా.. పంచాయితీ అంతా గుంటూరుకారం, హనుమాన్ మధ్యనే. ఒకే రోజు రెండు సినిమాలు పోటీపడితే.. ఓపెనింగ్స్ దక్కవు. సూపర్‌స్టార్ మూవీ ఎన్ని ఎక్కువ థియేటర్స్‌లో రిలీజైతే అంత బెనిఫిట్. టీజర్.. ట్రైలర్ హనుమాన్‌పై అంచనాలు పెంచేశాయి.
Guntur Karam Item Song : మహేష్ కోసం మాస్ మసాలా సాంగ్
గుంటూరుకారంతో పోటీపడితే.. హనుమాన్‌కు ఎక్కువ థియేటర్స్ దొరకవు. హనుమాన్‌తో పోటీ పడాల్సి వస్తే.. గుంటూరుకారం భారీ ఓపెనింగ్స్ మిస్ అవుతుంది. ఏదో ఒక సినిమా ఒకరోజు ముందు జరిగితే ఇద్దరికీ మంచిదన్న సలహా ఇచ్చినా.. ఎవరూ తగ్గడం లేదు. రిలీజ్ డేట్స్.. థియేటర్స్ సర్దుబాటుపై జరిగిన మీటింగ్ అసంపూర్ణంగా ముగిసింది. రెండుమూడు రోజుల్లో మరోసారి కలిసి నిర్ణయం తీసుకుంటారట. వాతారణం చూస్తుంటే.. ఎవరూ తగ్గనట్టు కనిపించినా.. చివరికి ఎవరో ఒకరు తగ్గక తప్పదు. 12న కాకుండా.. 11నే రావాలని హనుమాన్‌పై నిర్మాతలు ఒత్తిడి తెచ్చారని.. అయితే నిర్మాత మాత్రం నో చెప్పారని తెలిసింది. హనుమాన్‌పై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో వున్న మేకర్స్.. మహేశ్ వంటి స్టార్ వున్నా.. థియేటర్స్ దొరక్కకపోయినా.. 12నే వస్తామంటున్నారు.
MAHESH BABU: అమెరికాకి మహేష్.. తిరిగొచ్చి గుంటూరు కారం ప్రమోషన్
థియేటర్స్ కోసం ఫైట్ చేస్తున్నామని.. 400 థియేటర్స్ మాత్రమే దొరుకుతున్నాయని ట్రైలర్ రిలీజ్‌లో దర్శకుడన్నాడు. హనుమాన్ వారం ఆడే సంక్రాంతి సినిమా కాదని.. లాంగ్ రన్ వున్న మూవీ అవుతుందన్నాడు. హనుమాన్ తెలుగులో కంటే.. హిందీలో ఎక్కువ ఓపెనింగ్స్ తీసుకొచ్చేలా కనిపిస్తోంది. టీజర్.. ట్రైలర్‌తో సినిమాకు హైప్ రావడం ఒక కారణమైతే.. హిందీలో 1500కు పైగా థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. 400 థియేటర్స్‌లో వస్తున్న తెలుగు వెర్షన్ కంటే.. 1500 థియేటర్స్‌లో విడుదలవుతున్న హిందీ వెర్షన్ భారీ వసూళ్లు రాబట్టనుంది. సినిమా ఎలా వున్నా.. పండగ రోజుల్లో థియేటర్స్ కీ రోల్ పోషిస్తాయి.
ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి కంటే ఎక్కువగా.. వాల్తేరు వీరయ్యకు ధీటుగా వారసుడు మూవీకి థియేటర్స్ దొరకడం ప్లస్ అయింది. వీరసింహారెడ్డికి ఎక్కువ థియేటర్స్ వుంటే.. ఆరేడు కోట్లు అదనంగా వచ్చేదని అప్పట్లో ఫిలిం వర్గాలు భావించాయి. మరి 2024 సంక్రాంతికి థియేటర్స్ లేక ఎవరు నష్టపోతారో మరి.