What’s App: వాట్సప్ చాట్ లో హార్ట్ ఇమోజీ పెడితే రూ. 20 లక్షలు జరిమానా.. ఐదేళ్ల జైలు శిక్ష
వాట్సప్ దీనికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏ చిన్న విషయానికైనా వాట్సప్ ఉపయోగిస్తున్నాం. లొకేషన్, కాంటాక్ట్స్, ఫోటోస్, వీడియోస్ ఇలా ఒకటేంటి అన్నీ వాట్సప్ లోనే అయిపోతున్నాయి. మరికొందరు దీనిని అసాంఘీక కార్యకలాపాలకు కూడా వాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఒక దేశం వాట్సప్ లోని లవ్ ఇమోజీపై ప్రత్యేక ఆంక్షలు విధించింది. వాట్సప్ చాటింగ్ లో దిల్ సింబల్ పంపిస్తే జైలుకు పంపిస్తామని సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇంతకు ఇంతటి కఠినమైన రూల్స్ తీసుకొచ్చిన దేశం ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

Saudi has said that if you put red color heart emoji on WhatsApp, you will be fined along with imprisonment
నేటి యుగంలో ప్రతి ఒక్కరూ కొత్తదనం, సులభతరం కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగా రూపొందించారు ఈ వాట్సప్ యాప్ ని. కనీస అక్షర జ్టానం లేని వాళ్లు కూడా ఈ యాప్ ఉపయోగిస్తున్నారు. ఈ యూజర్ల సంఖ్య ప్రపంచ దేశాలలోకంటే మన దేశంలోనే అధికంగా ఉంది. ప్రస్తుతం మన దేశంలో వాట్సప్ ఉపయోగించే వారి సంఖ్య 535.8 మిలియన్ అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఏ స్తాయిలో దీనిని వాడుతున్నారో. ఏ భావాన్ని ఇతరులతో వ్యక్త పరుచుకోవాలన్నా దీనినే ఉపయోగిస్తున్నారు. ఏడుపు, దు:ఖం, ఆనందం, ఆకలి, కోపం, జాలి, ప్రేమ ఇలా అన్నింటికీ వాట్సప్ వేదిక అవుతుంది.
ఇలాంటి తరుణంలో సౌదీ అరేబియా ఒక కొత్త రూల్ ప్రవేశపెట్టింది. వాట్సప్ లో రెడ్ హార్ట్ ఎమోజీని వాడితే అది వేధింపులతో సమానం అని ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మనతో చాట్ చేసే ఎదుటివ్యక్తి అనుమతి లేకుండా రెడ్ హార్ట్ ఎమోజీ పంపితే రెండేళ్ల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ నేరం పదే పదే చేస్తే రూ. 60 లక్షల జరిమానాతో పాటూ ఐదు సంవత్సరాల కారాగార శిక్షపడేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని సౌదీకి చెందిన యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ అధికారికంగా ప్రకటించారు. మామూలుగానే సౌదీ అరేబియా అంటే కఠినమైన శిక్షలు, నడిరోడ్డుమీద చంపివేయడాలు ఉంటాయి. అలాంటి దేశంలో ఇలాంటి సరికొత్త రూల్స్ తీసుకురావడం అంటే కాస్త ఇబ్బందిగా మారిందంటున్నారు సామాజిక మాధ్యమాలను ఉపయోగించే వారు. అలాగే ఎవరితో పడితే వారితో చాట్ చేయకుండా, అనవసరమైన చిక్కుల్లో పడకుండా ఉండేందుకు ఇది చాలా బాగా దోహదపడుతుందని అంటున్నారు.
T.V.SRIKAR