శ్రీతేజ్ ను కాపాడండి, హాస్పిటల్ కు మెగాస్టార్

టాలీవుడ్ లో ఇప్పుడు సంధ్య థియేటర్ ఘటన ఏమలుపులు తిరుగుతుందో... ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఈ ఘటనలో రేవతి అనే ఒక మహిళ మృతి చెందడం సంగతి పక్కన పెడితే... ఇప్పుడు గాయాలతో చికిత్స పొందుతున్న శ్రీ తేజ అనే బాలుడు విషయంలో సినిమా పరిశ్రమ చాలా వరకు భయపడుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 23, 2024 | 04:09 PMLast Updated on: Dec 23, 2024 | 4:09 PM

Save Sree Tej Megastar To The Hospital

టాలీవుడ్ లో ఇప్పుడు సంధ్య థియేటర్ ఘటన ఏమలుపులు తిరుగుతుందో… ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఈ ఘటనలో రేవతి అనే ఒక మహిళ మృతి చెందడం సంగతి పక్కన పెడితే… ఇప్పుడు గాయాలతో చికిత్స పొందుతున్న శ్రీ తేజ అనే బాలుడు విషయంలో సినిమా పరిశ్రమ చాలా వరకు భయపడుతుంది. అతనికి ఏదైనా జరిగితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మరింత సీరియస్ అయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కూడా మరిన్ని ఇబ్బందులు ఖచ్చితంగా పడే అవకాశాలుంటాయి.

సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో పాటుగా సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా కచ్చితంగా చిక్కుల్లో పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆ బాలుడి ప్రాణం కాపాడే విషయంలో సినిమా పరిశ్రమ మొత్తం నానా కష్టాలు పడుతోంది. అందుకే సినిమా పెద్దలు కూడా ఆ బాలుడు చికిత్స పొందుతున్న హాస్పిటల్ యాజమాన్యంతో ఇప్పటికే చర్చలు జరిపారు. ఎంత ఖర్చైనా పర్వాలేదని అవసరమైతే విదేశాలకు కూడా పంపిద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ బాలుడిని పరామర్శించేందుకు తాజాగా పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ కూడా వెళ్ళాడు.

అలాగే నిన్న అల్లు అరవింద్ కూడా ఆ బాలుడిని పరామర్శించారు. సుకుమార్ భార్య బాలుడు కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. డిసెంబర్ 9న శ్రీ తేజ్ తండ్రికి ఐదు లక్షల సహాయం అందించారు. అటు అల్లు అరవింద్ కూడా బాలుడు విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఎంతైనా ఖర్చు పెట్టడానికి అల్లు అరవింద్ రెడీ అవుతున్నారు. ఆ బాలుడికి జరగడానికి జరిగితే మాత్రం కచ్చితంగా మరోసారి అల్లు అర్జున్ పై మరో కేసు నమోదయ్య అవకాశం ఉంటుంది. అందుకే అల్లు అరవింద్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అప్పుడు కచ్చితంగా అరెస్టు చేయడమే కాకుండా మరిన్ని ఇబ్బందులు అల్లు అర్జున్ ఎదుర్కొక తప్పదు అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. దీనితో సినిమా పరిశ్రమ కూడా భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమనే అభిప్రాయం ఉన్న నేపథ్యంలో సినిమా వాళ్ళందరూ ఆ హాస్పిటల్ కు పరుగులు తీస్తున్నారు. శ్రీతేజను పరామర్శించడానికి మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్ళనున్నారట. అలాగే రామ్ చరణ్ తో కలిసి వరుణ్ తేజ్ కూడా హాస్పిటల్ కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక సంధ్య థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ కు బెయిల్ రావడంతో తెలంగాణ పోలీసులు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనబడుతోంది.