Save The Tigers Review: ఫన్ రైడ్.. కామెడీ కమ్ ఎమోషనల్ డ్రామా
మహి వి రాఘవ్ నిర్మాణ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది. తాజాగా సిరీస్‌కు సీక్వెల్‌గా వచ్చిన 'సేవ్ ది టైగర్స్ 2' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.మరి సీకక్వెల్ ఆడియన్స్‌ను మెప్పించిందా లేదా మన రివ్యూలో చూద్దాం.
Save The Tigers Review: ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభివన్ గోమఠం ముఖ్యపాత్రల్లో జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మహి వి రాఘవ్ నిర్మాణ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది. తాజాగా సిరీస్‌కు సీక్వెల్‌గా వచ్చిన ‘సేవ్ ది టైగర్స్ 2’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.మరి సీకక్వెల్ ఆడియన్స్‌ను మెప్పించిందా లేదా మన రివ్యూలో చూద్దాం.
స్టోరీ విషయానికి వస్తే..
‘సేవ్ ది టైగర్స్ ఫస్ట్ సీజన్ ముగిసిన చోటు నుంచే పార్ట్ 2 ప్రారంభం అవుతుంది. హీరోయిన్ హంసలేఖ కనిపించకుండా పోతుంది ..ఆమెను కిడ్నాప్ వెనకాల గంటా రవి ,విక్రమ్ ,రాహుల్ ఉన్నారంటూ పోలీసులు ప్రశ్నిస్తారు. కనిపించకుండా పోయిన హంసలేఖను వీళ్లే మర్డర్ చేసారంటూ పలు న్యూస్ ఛానెల్స్ అనుమానం వ్యక్తం చేస్తూ కథనాలు ప్రసారం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగింది. హంసలేఖతో ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏమిటి.. హీరోయిన్ హంసలేఖ వ్యవహారంలో తమ భర్తలను వారి భార్యలు ఎలా అనుమానించారు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మూడు జంటల మధ్య గొడవలు జరగడానికి అసలు కారణం ఏమిటన్నది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
పర్పామెన్స్ విషయానికి వస్తే..
ప్రియదర్శితో పాటు అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణలు మరోసారి తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ఎక్కడా ఎక్కువ తక్కువ కాకుండా నటనతో పాటు కామెడీ కూడా పండించారు. జోర్డార్ సుజాత మరోసారి తన పాత్రలో రెచ్చిపోయింది. అటు గ్లామర్ గా, ఇటు హోమ్లీ గా తన కట్టుబొట్టుతో ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. నేచురల్ నటనతో మరోసారి మెస్మరైజ్ చేసింది.తన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. ఇక సత్యకృష్ణ, సీరత్ కపూర్ తన పరిధి మేరకు నటించారు. గంగవ్వ, ముక్కు అవినాష్ తదితరులు తమ పరిధి మేరకు చేశారు. రోహిణి మరోసారి మాస్ మెయిడ్ క్యారెక్టర్‌లో నవ్వించారు.
టెక్నికల్ విషయానికి వస్తే..
టీవీ ఛానెళ్లలో మనం రెగ్యులర్ చూసే వైరల్ న్యూస్.. దాంతో ప్రతిస్పందించే ప్రజలు.. దీంతో జరగే పరిణామాలను ఎంతో సెటైరికల్‌గా చూపించాడు దర్శకుడు అరుణ్ కొత్తపల్లి. అసలు సమాజంలో ఏం జరిగిందో తెలుసుకునే తీరిక, ఓపిక ఎవరికి ఉండటం లేదు. అసలు విషయం తెలుసుకోకుండా చేసే ప్రయత్నాల వల్ల కొన్ని జీవితాలు నాశనం అవుతుంటాయనే విషయాన్ని సూటిగా సుతి మెత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. మొత్తంగా మహి వి రాఘవ్ .. సేవ్ ది టైగర్స్ లో చేసిన మాయ సీక్వెల్‌లో కూడా రిపీట్ అయింది. మహి వి రాఘవలో రచనలో డ్రామా బాగుంది. ఒక మందు బిళ్లకు షుగర్ కోట్ వేసినట్టు ఈ సినిమా ఆద్యంతం నవ్వుతూనే మంచి సందేశం ఇచ్చారు. మొత్తం ఫస్ట్ 3 ఎపిసోడ్స్ నవ్విస్తాయి. కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా చక్కగా కుదిరాయి. మహి వి రాఘవ నిర్మాణ విలువలు బాగున్నాయి. కొన్ని సీన్స్ చూస్తుంటే.. సమాజంలో మోసపోయే వ్యక్తుల వార్తలను ఈ సినిమాలో కామెడీ కమ్ సందేశం కోసం ఏర్చి కూర్చి పెట్టినట్టు ఉంది. ఓవరాల్ గా సేవ్ ది టైగర్స్ చూసిన వాళ్లకు ఈ సీక్వెల్ కూడా తప్పకుండా నచ్చుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి.. బంధాలు ఎలా నిలుపుకోవాలి.. ధైరంగా ఎలా ముందుకు సాగాలో చెబుతుంది. వీకెండ్ మీ టైమ్ అడ్జస్ట్ చేసుకోండి. హ్యాపీగా సిరీస్ చూడండి.