సావిత్రి.. శ్రీదేవి.. జయలలిత ఓ రష్మిక.. బాలీవుడ్ పై డామినేషన్
బాలీవుడ్. టాలీవుడ్ అనే తేడా లేకుండా రష్మిక మందన దూసుకుపోతోంది. వరుస ప్రాజెక్టులతో సక్సెస్ లు చూస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది రష్మిక. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల కొరత ఉంది.

బాలీవుడ్. టాలీవుడ్ అనే తేడా లేకుండా రష్మిక మందన దూసుకుపోతోంది. వరుస ప్రాజెక్టులతో సక్సెస్ లు చూస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది రష్మిక. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల కొరత ఉంది. ప్రియాంక చోప్రా, దీపిక ఫెడవుట్ అయిపోయారు. దీనితో ఆ ప్లేస్ ను భర్తీ చేయడానికి రష్మిక కష్టపడుతుంది. యానిమల్ సినిమా తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. అక్కడ సూపర్ హిట్ కొట్టింది. ఆ సినిమాలో ఆమె యాక్టింగ్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి.
గీతాంజలి పాత్రలో రష్మిక దుమ్మురేపింది. ఇక విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ఈ కన్నడ బ్యూటీ. ఇక ఆ తర్వాత తెలుగులో పుష్ప సినిమాతో ఆమె బాలీవుడ్ లో మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది. పాత్ర ఎలా ఉన్నా సరే ఆ పాత్రకి తగ్గట్టు నటిస్తూ అవసరమైతే గ్లామర్ షో చేస్తూ అల్లాడిస్తుంది రష్మిక. పుష్ప సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక గ్లామర్ విషయంలో కూడా పుష్ప సినిమాలో కావాల్సినంత షో చేసింది. ఇక బాలీవుడ్ లో వరుస ఆఫర్లు ఆమెను వరిస్తున్నాయి.
ఇక లేటెస్ట్ గా వచ్చిన ఛావా సినిమా కూడా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టిందని చెప్పాలి. చత్రపతి శివాజీ కుమారుడు శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తొలిరోజే 32 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డులు బ్రేక్ చేసింది. ఇలా బాలీవుడ్ లో రష్మిక నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఏకంగా పుష్ప సినిమా అయితే దాదాపు 900 కోట్లు హిందీలోనే కలెక్ట్ చేసింది. ఇక దాదాపు 2000 కోట్లు ఆ సినిమా వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.
లేటెస్ట్ గా వచ్చిన ఛావా కూడా దాదాపు 350 నుంచి 400 కోట్ల వరకు కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలుగులో డబ్ కాకపోవడంతో పెద్దగా ఆదరణ ఉండటం లేదు. అయితే విక్కీ కౌశల్ యాక్టింగ్ కోసం రష్మిక యాక్టింగ్ కోసం జనాలు థియేటర్ల వైపు క్యూ కడుతున్నారు. ఇక ఇప్పుడు రష్మిక బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ అయిపోయే సిగ్నల్స్ కనబడుతున్నాయి. శ్రీదేవి, సావిత్రి, జయలలిత తర్వాత బాలీవుడ్ లో సౌత్ ఇండియా హీరోయిన్లు పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ ఆ లోటును భర్తీ చేస్తూ రష్మిక బాలీవుడ్ లో దుమ్ము రేపుతోంది. హిందీ కూడా అనర్గళంగా మాట్లాడే రష్మికకు ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఇలా భారీ బడ్జెట్ సినిమాలతో రష్మిక హిందీలో బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగులో కూడా ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. అటు తమిళం, కన్నడంలో కూడా రష్మిక బిజీ అయిపోయింది.