అక్కినేని వారసులకి మళ్లీ మళ్లీ పెళ్లి తప్పదా…?
సినిమా వాళ్ళ జీవితాల్లో పెళ్లి, విడాకులు, సహజీవనం, వివాదాలు చాలా మామూలు విషయాలు.స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు వీటికి అలవాటు పడిపోయారో లేక కాలమే అలా తీసుకువెళ్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. చాలా మంది సినిమా వాళ్ళు మొదటి పెళ్లి చేసుకోవడం భార్య కు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది అక్కినేని ఫ్యామిలీ లో అందరికీ తప్పనిసరి అయిపోయింది. నాగార్జున నుంచి అఖిల్ వరకు రెండో పెళ్లి తప్పడం లేదు.
నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ముగ్గురికి రెండు పెళ్లిళ్లు తప్పలేదు. నాగార్జున… నిర్మాత , దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మీని మొదటి వివాహం చేసుకున్నారు. పెళ్లి తరవాత అమెరికా వెళ్లిపోయారు.ఆ వివాహం జరిగిన కొన్నాళ్ళకు… నాగ చైతన్య పుట్టడం, యేవో వివాదాలతో ఇద్దరూ దూరం కావడం జరిగాయి. చివరకు ఆమె తిరిగి అమెరికా వెళ్ళిపోయి అక్కడే స్థిరపడ్డారు. ఇక నాగ చైతన్య మాత్రం ఎక్కువగా తండ్రి దగ్గరే ఉన్నాడు. మేనమామలు వెంకటేష్, సురేష్ పర్యవేక్షణ లో పెరిగాడు.ఆ తర్వాత నాగార్జున… హీరోయిన్ అమలను వివాహం చేసుకుని అఖిల్ కు తండ్రి అయ్యారు. నాగార్జున , టాబు రిలేషన్ పై చాలా కథలు వినిపించాయి. అమల తో నాగార్జున కు మధ్య లో మనస్పర్థలు వచ్చినా… ఫ్యామిలీ బ్రేక్ చేయకుండా నడుపుకొచ్చాడు.ఇది నాగార్జున స్టోరీ కాగా…
నాగ చైతన్య విషయానికి వస్తే… మొదట శృతి హాసన్ తో లివింగ్ రిలేషన్ నుంచి పెళ్లి వరకు వరకు వెళ్లి వెనక్కి వచ్చాడు. తరవాత ఏం మాయ చేశావో మూవీ లో సమంత కు దగ్గర అయి,దాదాపు ఏడేళ్ళ పాటు ప్రేమించిన , సామ్ ని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ రెండేళ్ళ పాటు బాగానే ఉన్నారు. ఆ తర్వాత చిన్న చిన్న వివాదాలు మొదలై అవి తీవ్ర రూపం దాల్చాయి. 2021 లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు శోభిత ధూళిపాళ్ళను రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇక అఖిల్ విషయానికి వస్తే… ఈ యంగ్ హీరో జీవీకే రెడ్డి మనమరాలు శ్రేయా భూపాల్ ను వివాహం చేసుకోవాలని నిశ్చితార్ధం కూడా చేసుకున్నాడు. కాని అనూహ్యంగా పెళ్ళికి నాలుగు రోజుల ముందు ఆ నిశ్చితార్ధం బ్రేక్ అయింది. అఖిల్ ప్రవర్తన నచ్చక శ్రేయ భూపాల్ నో చెప్పేసిందని టాక్. పైగా జీవీకే ఫ్యామిలీ ఈ సంబంధం విషయం లో మొదటి నుంచి సుముఖంగా లేదు. అఖిల్ ఇప్పుడు మరో యువతిని భార్య గా వెతుక్కునే పనిలో ఉన్నాడు.
ఇక నాగార్జున మేనల్లుడు సుమంత్ పరిస్థితి కూడా అంతే… తనతో కలిసి నటించిన కీర్తి రెడ్డిని సుమంత్ వివాహం చేసుకున్నాడు. కాని ఇద్దరి మధ్య తీవ్రమైన గ్యాప్ వచ్చి విడిపోయారు. ఇప్పుడు సుమంత్ ఒంటరిగానే ఉంటున్నాడు. అప్పుడప్పుడు సుమంత్ గురించి గాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి.సుమంత్ సోదరి యార్లగడ్డ సుప్రియ కూడా ఇంతే. మొదటి వివాహం చేసుకుని విడిపోయి ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు. అన్నపూర్ణ స్టూడియో నిర్వహణ చూసుకుంటున్నారు.మొన్నా మధ్య అడవి శేష్ ను రెండో వివాహం చేసుకుంటున్నారు అనే వదంతులు వచ్చాయి. కానీ నిజం కాదని తేలింది. వయస్సులో ఆమె అడవిశేష్ కన్నా చాలా పెద్ద. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ క్లాస్మేట్ కూడా అయిన సుప్రియ పవన్కళ్యాణ్ కి తొలి హీరోయిన్. ఇలా అక్కినేని కుటుంబానికి మొదటి పెళ్లి శాపంలా మారింది. ఎవరు పెళ్లి చేసుకున్నా అది ఫస్ట్ బ్రేక్ అయిపోతుంది. విడాకులు ఇప్పుడు పెద్ద విషయం కాకపోయినా ఒకే కుటుంబం లో అందరు విడాకులు తీసుకోవటం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం.