‘సీతమ్మ వాకిట్లో..’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇదేం రచ్చ బాబోయ్.. కొత్త సినిమాలా కుమ్మేసిందిగా..!

మన తెలుగు ప్రేక్షకులకు ఒక గొప్పతనం ఉంది. మనవాళ్లు ఒకసారి సినిమా చూడాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత అది పాతదా, కొత్తగా అన్ని చూడరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 10, 2025 | 03:01 PMLast Updated on: Mar 10, 2025 | 3:01 PM

Seethamma Vakitlo Sirimalle Chettu First Day Collections

మన తెలుగు ప్రేక్షకులకు ఒక గొప్పతనం ఉంది. మనవాళ్లు ఒకసారి సినిమా చూడాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత అది పాతదా, కొత్తగా అన్ని చూడరు. థియేటర్ కు వెళ్ళామా, టికెట్లు తెగయా లేదా అనేది మ్యాటర్. తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విషయంలోనూ ఇదే జరిగింది. 11 ఏళ్ల కింద విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. తాజాగా రీ రిలీజ్ చేస్తే ప్రేక్షకులు మరోసారి ఈ సినిమా చూడడానికి అలాగే ఎగబడ్డారు. బయట ఎండలు మండిపోతున్న కూడా ఈ సినిమా కోసం కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటిరోజు ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2 కోట్ల వరకు వసూలు చేసింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. పోకిరి రీ రిలీజ్ ఫస్ట్ డే కంటే ఇది ఎక్కువ. జల్సా, ఖుషి, ఒక్కడు, సింహాద్రి లాంటి సినిమాలు మొదటి రోజు 4 నుంచి 6 కోట్ల మధ్యలో వసూలు చేశాయి. అయితే అవి మాస్ సినిమాలు. ఇక పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు కాబట్టి దానికి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ప్యూర్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైలర్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా దాదాపు రెండు కోట్ల ఓపెనింగ్ తీసుకురావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది.

ఈ వారం చావా తెలుగు వర్షన్ సహా జీవి ప్రకాష్ కుమార్ కింగ్ స్టన్, 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో, ఆమని కీలక పాత్రలో నటించిన నారి, ఆదిత్య ఓం బంది లాంటి సినిమాలు ఈ వారం విడుదలయ్యాయి. ఈ కొత్త సినిమాల కంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకు ఎక్కువ కలెక్షన్స్ రావడం మరో విశేషం. దిల్ రాజు ఈ సినిమాను భారీ స్థాయిలోనే రీ రిలీజ్ చేశాడు. దాదాపు 600 స్క్రీన్స్ లో ఈ సినిమా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో తక్కువలో తక్కువ 50% థియేటర్లో హౌస్ ఫుల్ అయ్యాయి అంటే ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. అంతేకాదు థియేటర్స్ నుంచి ఫ్యాన్స్ డాన్స్ చేస్తున్న వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. ఒక థియేటర్లో అయితే ఏకంగా క్లైమాక్స్ సీక్వెన్స్ అంతా థియేటర్లో రిపీట్ చేశారు. పాటలు వస్తుంటే ఆడిటోరియమ్స్ మార్మోగిపోతున్నాయి. మొత్తానికి చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక రీ రిలీజ్ సినిమా థియేటర్లలో పెద్ద ఎత్తున సందడి చేసింది.