మనోజ్ హాస్పిటల్ రిపోర్ట్ లో సంచలనం, శరీరంపై అనుమానాస్పద గాయాలు
మంచు ఫ్యామిలీ గొడవలు తొలిసారి రచ్చ రచ్చ అయ్యాయి. ఇన్నాళ్ళు గొడవలు జరుగుతున్నాయనే క్లారిటీ జనాలకు ఉన్నా ఈ రేంజ్ లో ఎప్పుడూ కంప్లీట్ క్లారిటీ లేదు. మంచు మనోజ్ ను ఆస్తుల కోసం వేధిస్తున్నారు అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది.

మంచు ఫ్యామిలీ గొడవలు తొలిసారి రచ్చ రచ్చ అయ్యాయి. ఇన్నాళ్ళు గొడవలు జరుగుతున్నాయనే క్లారిటీ జనాలకు ఉన్నా ఈ రేంజ్ లో ఎప్పుడూ కంప్లీట్ క్లారిటీ లేదు. మంచు మనోజ్ ను ఆస్తుల కోసం వేధిస్తున్నారు అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. గతంలో కూడా మంచు విష్ణు… తన తమ్ముడిపై దాడి చేసాడనే వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు నేరుగా మనోజ్… తనను దారుణంగా కొట్టారు అంటూ కంప్లైంట్ ఇవ్వడం, ఆస్పత్రికి తన భార్యతో కలిసి వెళ్ళడం చూసి జనాలు షాక్ అయ్యారు. అసలు నడవలేని స్థితిలో వెళ్ళాడు మనోజ్.
బంజారాహిల్స్ ఆస్పత్రిలో మంచు మనోజ్ జాయిన్ అయ్యాడు. జల్‌పల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా దుండగులు దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. భార్య మౌనికతో కలిసి మనోజ్ ఆస్పత్రికి వెళ్ళాడు. నడవలేని స్థితిలో ఉన్న మంచు మనోజ్ వీడియోలు చూసి జనాలు షాక్ అయ్యారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స చేసిన వైద్యులు… అనంతరం పలు పరిక్షలు కూడా నిర్వహించారు. ఇక తన తండ్రి ఆధ్వర్యంలో నడిచే స్కూల్‌కు సంబంధించిన సిబ్బంది తనపై దాడి చేశారని మనోజ్ చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే మంచు మనోజ్ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేసాడు.
అయితే అసలు తమ ఇంట్లో ఏం జరగలేదు అని… కావాలనే కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంచు కుటుంబం చెప్పే ప్రయత్నం చేసింది. మంచు విష్ణు దీనిని కవర్ చేసే ప్రయత్నం చేసాడు. ఇక మంచు విష్ణు కవర్ డ్రైవ్ కు పోలీసుల రిప్లయ్ ఇచ్చారు. మోహన్ బాబు తనపై దాడి చేసినట్లు మంచు మనోజ్ డయల్ 100 కు ఫోన్ చేసిన చెప్పినట్లుగా పహాడీ షరీఫ్ సీఐ నిర్ధారించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇక ఆస్పత్రిలో నిర్వహించిన పరిక్షల తాలుకా రిపోర్ట్ మీడియాకు లీక్ అయింది.
బంజారాహిల్స్ TX హాస్పిటల్ నుంచి మంచు మనోజ్ డిశ్చార్జ్ అయ్యాడు నిన్న సాయంత్రమే. నేడు మరోసారి TX ఆస్పత్రికి మంచు మనోజ్ రానున్నట్టు తెలుస్తోంది. మంచు మనోజ్ ఎమ్మెల్సీ పూర్తి చేసిన వైద్యులు… రిపోర్ట్ లో సంచలన విషయాలు పేర్కొన్నారు. మంచు మనోజ్‌పై అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయని పోలీసులకు హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇంటర్నల్‌గా కాలు, మెడ భాగంలో దెబ్బలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ ఎక్స్ రే పరీక్షలు వైద్యులు నిర్వహించారు. దీనితో మంచు మనోజ్ ఇంటికి వెళ్లి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. అటు పోలీసులపై ఒత్తిడి చేసేందుకు మంచు మోహన్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు.