కార్వాన్‌లోకి లాక్కెళ్లి.. ప్యాంట్‌ జిప్ తీసి.. జానీ మాస్టర్‌ బాగోతాలు…

నేషనల్ అవార్డ్‌ విన్నర్, ఫేమస్ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డ్యాన్స్ మాస్టర్‌గానే కాకుండా.. డ్యాన్స్‌ షోకు జడ్జిగా.. ప్రతీ ఒక్కరిని తెలిసిన కటౌట్ అది. ఇక ఈ మధ్య ఏపీ ఎన్నికల సమయంలోనూ కాస్త హడావుడి చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 16, 2024 | 03:34 PMLast Updated on: Sep 16, 2024 | 3:34 PM

Sensational On Jony Master Case

నేషనల్ అవార్డ్‌ విన్నర్, ఫేమస్ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డ్యాన్స్ మాస్టర్‌గానే కాకుండా.. డ్యాన్స్‌ షోకు జడ్జిగా.. ప్రతీ ఒక్కరిని తెలిసిన కటౌట్ అది. ఇక ఈ మధ్య ఏపీ ఎన్నికల సమయంలోనూ కాస్త హడావుడి చేశాడు. కెరీర్‌లో టాప్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న జానీ మాస్టర్‌కు.. ఇప్పుడు అనుకోని బ్రేక్‌లు పడ్డాయ్‌. ఎవరూ ఊహించని విధంగా ఎదురు దెబ్బ తగిలింది. ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌ నార్సింగి పీఎస్‌లో జానీ మాస్టర్‌పై లైంగిక దాడి కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌ కాపీలో సంచలన విషయాలు వెలుగుచూశాయ్‌.

జానీ మాస్టర్ తనను కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని.. యువతి ఫిర్యాదులో తెలిపింది. తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ కంప్లైంట్ ఇచ్చింది. 2019 నుంచి తనపై జానీ మాస్టర్‌ వేధింపులకు గురిచేస్తున్నాడని చెప్పుకొచ్చింది. ఈటీవీ ఢీ షోలో జానీ మాస్టర్ పరిచయం అయ్యారని.. ఆ తర్వాత తనను ఆయన టీంలో చేర్చుకున్నారని తెలిపింది. ఔట్‌ డోర్ షూటింగ్ పేరుతో చెన్నై, ముంబై ,హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో… జానీ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ప్రతిఘటిస్తే తీవ్రంగా దాడి చేశాడని బాధితురాలు తెలిపింది. షూటింగ్ స్పాట్‌లోనూ వదిలేవాడు కాదని.. కార్వాన్‌లోకి లాక్కెళ్లి.. ప్యాంట్ జిప్ తీసి.. చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని ఎఫ్ఐఆర్‌లో ఉంది.

తను చెప్పిన దానికి అంగీకరించకపోతే.. అద్దానికి తన తల బాదేవాడని.. తీవ్రంగా దాడి చేసేవాడని.. వాపోయింది. ఐతే జానీ మాస్టర్‌ ఎన్ని దారుణాలు చేసినా.. ఆయనకు ఎప్పుడూ తను లొంగిపోలేదని రాసుకొచ్చింది. మతం మార్చుకొని.. తనను పెళ్లి చేసుకోవాలని జాన్ మాస్టర్ వేధింపులకు పాల్పడేవాడని.. జానీ మాస్టర్‌కు ఆయన భార్య కూడా సహకరించేదని.. వాపోయింది. లైంగిక కోరికలు తీర్చడానికి తనని వివాహం చేసుకోవాలని, ఒకవేళ వివాహం చేసుకోకపోతే.. ఇండస్ట్రీలో లేకుండా చేశానని భయపెట్టాడని ఆరోపించింది. జాని మాస్టర్ భార్య కూడా తనకు సహకరించేదనీ.. ఇంటికి వచ్చి మరీ ఆమె తనపై దాడి చేసిందని ఎఫ్ఐఆర్‌లోతెలిపింది బాధితురాలు. ఇక జానీ మాస్టర్ పై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో జానీ మాస్టర్‌పై ఐపీసీ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు. సెక్షన్ 376, నేరపూరితంగా బెదిరింపులు, ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, కింద కేసు నమోదు చేశారు.