Ram Charan Vs Shah Rukh Khan: అంబానీ ఇంట రామ్ చరణ్‌కు అవమానం.. షారుఖ్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్
ప్రస్తుతం సోషల్ మీడియాలో చరణ్, షారుఖ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవే జరుగుతోంది. అంబానీ తయనుడి వివాహానికి పలువురు స్టార్స్ హాజరై తమదైన శైలిలో వినోదాన్ని పంచారు. ముఖ్యంగా ఖాన్ త్రయం.. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తెగ హడావుడి చేశారు.

Ram Charan Vs Shah Rukh Khan: తెలుగు హీరోలు, హిందీ హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభాస్ నటించిన ‘సలార్’, షారుఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ ఒకేసారి విడుదలయ్యాయి. ఆ సమయంలో ప్రభాస్, షారుఖ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే జరిగింది. ఒకరినొకరు దారుణంగా ట్రోల్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ అభిమానుల వంతు వచ్చింది.
SSMB29 ..లుక్ టెస్ట్ పూర్తి..
ప్రస్తుతం సోషల్ మీడియాలో చరణ్, షారుఖ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవే జరుగుతోంది. అంబానీ తయనుడి వివాహానికి పలువురు స్టార్స్ హాజరై తమదైన శైలిలో వినోదాన్ని పంచారు. ముఖ్యంగా ఖాన్ త్రయం.. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తెగ హడావుడి చేశారు. ముగ్గురు కలిసి వేదికపై స్టెప్పులేశారు. ఇక నాటు నాటు సాంగ్ ప్లే అవుతున్న సమయంలో.. చరణ్ అక్కడే ఉన్నాడని తెలుసుకున్న షారుఖ్.. ఆయనను స్టేజ్ మీదకు పిలవబోతూ కామెడీ చేశాడు. రామ్ చరణ్ ఎక్కడున్నావ్.. ఇడ్లీ సాంబార్ తిని కూర్చున్నావా.. ఇడ్లీ, వడ, రామ్ చరణ్ అంటూ సరదాగా పిలిచాడు. ఆ తర్వాత చరణ్ వేదికపైకి వచ్చి.. ఖాన్ త్రయంతో కలిసి స్టెప్పులేశాడు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. చరణ్‌ని షారుఖ్ ఇడ్లీ, వడ అని పిలవడాన్ని కొందరు తప్పుబడుతున్నారు.
షారుఖ్ మాటల్లో సౌత్ స్టార్స్ పట్ల చులకన భావం కనిపించిందని.. చరణ్ వంటి బిగ్ స్టార్‌ని పట్టుకొని అలా పిలవడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. చరణ్ ఫ్యాన్స్‌తో పాటు మిగతా తెలుగు స్టార్ల అభిమానులు కూడా షారుఖ్ తీరుని తప్పుపడుతున్నారు. ఇక చరణ్ సతీమణి ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబాహాసన్ సైతం గ్లోబల్ స్టార్‌ని పట్టుకొని షారుఖ్ అలా పిలవడం బాధ కలిగిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే షారుఖ్ ఫ్యాన్స్ మాత్రం ఈ ఘటనను సమర్థిస్తున్నారు.