Rajinikanth: నేను చేయను.. రజనీకాంత్‌కు నో చెప్పిన షారుఖ్..

ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా త‌లైవ‌ర్ 171 చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు లోకేష్ క‌న‌గ‌రాజ్. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ మూవీలో గెస్ట్ రోల్ కోసం కింగ్ ఖాన్ షారూఖ్‌ని లోకేష్ సంప్ర‌దించాడట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 19, 2023 | 05:08 PMLast Updated on: Dec 19, 2023 | 5:08 PM

Shah Rukh Khan Said No To Guest Role In Rajinikanth Movie

Rajinikanth: బాలీవుడ్ అంతా సౌత్ జపం చేస్తోంది. కొందరు బాలీవుడ్ స్టార్లు సౌత్ మూవీస్‌లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరికొందరు సౌత్ డైరెక్టర్స్‌తో కలిసి ప్రాజెక్ట్స్ చేసి హిట్టందుకుంటున్నారు. రీసెంట్‌గా తమిళ దర్శకుడు అట్లీ తీసిన జవాన్‌తో సూపర్ హిట్ అందుకున్నాడు షారుక్ ఖాన్. తాజాగా షారుఖ్‌కు లోకేష్ కనగరాజ్ ఓ ఆఫర్ ఇచ్చాడు. వాస్తవానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మూవీలో ఛాన్స్ అంటే ఎగిరి గంతేసి ఒప్పుకోవాలి. కానీ, కింగ్ ఖాన్ మాత్రం నో అనేశాడట. అందుకు కారణం ఏంటో కూడా క్లారిటీ ఇచ్చాడు. ఖైదీతో తన మ్యాజిక్ ఏంటో చూపించి.. ‘విక్ర‌మ్’ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత లోకేష్ క‌న‌గ‌రాజ్ పేరు మార్మోగింది.

SALAAR: ఎవడ్రా రీమేక్ అనేది.. ట్రైలర్ చూసారా ఇంతకీ..

ఈ మధ్యే ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో తెర‌కెక్కించిన లియోకి డివైడ్ టాక్ వచ్చినా తమిళంలో బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించింది. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా త‌లైవ‌ర్ 171 చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ మూవీలో గెస్ట్ రోల్ కోసం కింగ్ ఖాన్ షారూఖ్‌ని లోకేష్ సంప్ర‌దించాడట. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేని బాలీవుడ్‌కి ఈ ఏడాది ఊపిరిపోశాడు షారుక్ ఖాన్. ఏడాది ఆరంభంలో పఠాన్‌తో హిట్టందుకున్నాడు. ఆ తర్వాత సౌత్ డైరెక్టర్ అట్లీతో జవాన్‌లో నటించి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే సంవత్సరంలో ముచ్చటగా మూడో మూవీ డంకీతో రాబోతున్నాడు. ఇలాంటి టైమ్‌లో లోకేష్ కనగరాజ్ మూవీలో ఆఫర్ అంటే వెంటనే ఓకే చెప్పాలి. లోకేష్ కనగరాజ్.. తన మూవీలో నటించమని షారుఖ్‌ను అడిగాడు. కానీ షారూఖ్ ఈ ఆఫ‌ర్‌ని సున్నితంగా తిర‌స్క‌రించాడు. ఇప్పుడీ విషయంపై డిస్కషన్ జరుగుతోంది. ఈ మధ్యే టైగ‌ర్ 3, బ్ర‌హ్మాస్త్ర లాంటి సినిమాల్లో గెస్ట్ రోల్‌లో మెరిసాడు షారు‌ఖ్. కానీ వాటితో ఒరిగిందేమీ లేదు. పైగా స‌ల్మాన్‌తో క‌లిసి అతిథిగా న‌టించిన ‘టైగ‌ర్ 3’ ఆశించిన ఫ‌లితాన్ని అందుకోక‌పోవ‌డం నిరాశ ప‌రిచింది.

ఇలాంటి టైమ్‌లో మరో మూవీలో గెస్ట్ రోల్ అంటే అవసరమా అనే ఆలోచించాడట. అందుకే రజనీకాంత్-లోకేష్ మూవీతో గెస్ట్ రోల్‌లో నటించేందుకు నో చెప్పేసాడట షారుఖ్. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గెస్ట్ రోల్ కాదు.. ఫుల్ లెంగ్త్ మూవీ చేద్దామని చెప్పాడట. త్వరలోనే కథ సిద్ధంచేయమని కూడా లోకేష్‌ను కోరాడట షారుఖ్ ఖాన్. దీంతో లోకేష్ హీరోస్ జాబితాలో షారు‌ఖ్ కూడా చేరిపోయాడనే డిస్కషన్ జరుగుతోంది. మరోవైపు అట్లీ.. జవాన్ సీక్వెల్ కోసం సన్నాహాలు చేస్తున్నాడు. ఇటు లోకేష్ కూడా వరుస ప్రాజెక్ట్స్‌కి కమిటయ్యాడు. ఇక రజనీ 171 మూవీలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చేందుకు షారు‌ఖ్ నో చెప్పడంతో మరో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌ని సంప్రదించాడట లోకేష్. కథ వినేందుకు రణ్‌వీర్ ఇంట్రెస్ట్ చూపించాడని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోందని టాక్.