Shah Rukh Khan: అక్కడ కింగ్ కావొచ్చు.. ఇక్కడ కాదు.. సౌత్‌లో షారుక్ సక్సెస్ అయ్యేనా..?

నయనతారతో జోడీ కట్టి షారుఖ్ చేసిన జవాన్ మూవీ వరల్డ్ వైడ్‌గా వచ్చేవారం రానుంది. ఇది పేరుకే హిందీ మూవీ. కాని, అచ్చంగా ఓ తమిళ్ సినిమాలో హిందీ హీరో నటించాడని చెబితే కరెక్ట్ అంటున్నారు సినీ విశ్లేషకులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 31, 2023 | 06:28 PMLast Updated on: Aug 31, 2023 | 6:28 PM

Shah Rukh Khan Trying Go Success In South With Jawan Movie

Shah Rukh Khan: కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సౌత్‌లో జెండా పాతేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ఏకంగా సౌత్ బ్యాచ్‌తో కలిసి హిందీ మూవీ చేస్తున్నాడు. నయనతారతో జోడీ కట్టి షారుఖ్ చేసిన జవాన్ మూవీ వరల్డ్ వైడ్‌గా వచ్చేవారం రానుంది. ఇది పేరుకే హిందీ మూవీ. కాని, అచ్చంగా ఓ తమిళ్ సినిమాలో హిందీ హీరో నటించాడని చెబితే కరెక్ట్ అంటున్నారు సినీ విశ్లేషకులు.

కారణం.. ఇందులో హీరోయిన్ నయనతార సౌతే. సపోర్టింగ్ రోల్స్, ఫైటర్స్, కొరియోగ్రాఫర్స్, మ్యూజీషియన్, ఇలా 90 శాతం తమిళ్ కాస్ట్ అండ్ క్రూతో నిండిపోయింది జవాన్ మూవీ. దీనికి కారణం తమిళ్ డైరెక్టర్ ఆట్లీ మేకింగ్‌లో ఈసినిమా రావటం మాత్రమే కాదు.. షారుఖ్ ఖాన్ కూడా సౌత్ ఆడియన్స్‌కి దగ్గరయ్యే ప్రయత్నం చేయటం. ఇంతవరకు ఆమిర్ ఖాన్ ఇలాంటి ప్రయత్నం చేసి సఫలం కాలేకపోయాడు. సల్మాన్ ఖాన్ మాత్రం జమానాలో ప్రేమ పావురాలు టైంలో సూరజ్ భర్జత్య సినిమాలతో సౌత్‌కి దగ్గరైనట్టే అయ్యి.. తర్వాత బాలీవుడ్‌కే పరిమితం అయ్యాడు.

ఇక హ్రితిక్ ధూమ్, క్రిష్ మూవీల టైంలో సౌత్ లో క్రేజ్ సొంతమైనా తర్వాత తను పట్టించుకోలేదు. ఇప్పుడు తనని సౌత్ జనం పట్టించుకునే పరిస్తితిలేదు. ఇలాంటి టైంలో షారుఖ్ అది కూడా షష్టిపూర్తి చేసుకునే వయసులో సౌత్ లో జెండా పాతుతాడా..లేదా..? వచ్చే వారం తేలనుంది.