Shah Rukh Khan: డంకీ మూవీ కోసం మళ్లీ గుడి చుట్టు షారుఖ్ ప్రదక్షిణలు
దేవుడి ఆశీస్సులు.. కంటెంట్ కలిసొచ్చి మొత్తంగా పఠాన్ మూవీకి రూ.1,000 కోట్ల వసూళ్లు వచ్చేలా చేశాయి. ఇలా వైష్ణదేవి ఆలయం తనకి సెంటిమెంట్‌గా కలిసొచ్చింది. తర్వాత తన జవాన్ మూవీకి మాత్రం తిరుపతి వెళ్లాడు.

Shah Rukh Khan: కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్.. ఎంత బాలీవుడ్ బాద్‌షా అయినా, బాక్సాఫీస్ కింగ్ అయినా తనకి హిట్ లేకపోతే కెరీరే డౌట్‌లో పడుతుంది. అందుకే తన కొత్త మూవీ డంకీ సక్సెస్ కోసం గుళ్లూ, గోపురాల చుట్టు ప్రదక్షిణాలు చేస్తున్నాడు. అలా షారుఖ్ తాజాగా గుళ్లో కనిపించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలైంది. నిజానికి సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఐదేళ్ళ తర్వాత పటాన్ సినిమా చేసినప్పుడు కూడా, ఇలానే షారుఖ్ వైష్ణో దేవి ఆలయానికి వెళ్లి పూజలు జరిపించాడు.
Jr NTR: దేవర రాక ఆలస్యం.. వార్ 2 కి బ్రేక్..
దేవుడి ఆశీస్సులు.. కంటెంట్ కలిసొచ్చి మొత్తంగా పఠాన్ మూవీకి రూ.1,000 కోట్ల వసూళ్లు వచ్చేలా చేశాయి. ఇలా వైష్ణదేవి ఆలయం తనకి సెంటిమెంట్‌గా కలిసొచ్చింది. తర్వాత తన జవాన్ మూవీకి మాత్రం తిరుపతి వెళ్లాడు. ఏడుకొండల సామి దర్శనం చేసుకున్నాడు. అలా శ్రీవారి ఆశీర్వాదం తీసుకున్నాక షారుక్‌కి జవాన్ రూపంలో బ్లాక్ బస్టర్ పడింది. అది కూడా రూ.వెయ్యికోట్ల మూవీగా మారింది. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్స్ కోసం మళ్లీ వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాడు షారుఖ్.
డంకీతో వెయ్యికోట్లకి ఎసరు పెట్టేలా ఉన్నాడు. కాని ట్రైలర్, పాటలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇది వెయ్యికోట్ల మూవీ కాదు.. గట్టెక్కితేనే గొప్ప అనేలా ఉన్నాయి కామెంట్స్. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.